అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం చిరంజీవితో జంధ్యాల గారు డిటెక్టివ్ వేషంలో పూయించిన నవ్వుల పువ్వులు ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపించడానికి కారణం అందులో ఉన్న హాస్యం. మళ్ళి అలాంటి సీక్రెట్ ఏజెంట్ నేపథ్యంలో తెలుగులో పెద్దగా సినిమాలు రాలేదు. ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ పేరుతో డెబ్యూ డైరెక్టర్ స్వరూప్ చేస్తున్న ప్రయత్నం త్వరలో మన ముందుకు రానుంది. నవీన్ పోలిశెట్టి-శృతి వర్మ జంటగా పరిచయమవుతున్న ఈ సినిమా కామెడీని బేస్ చేసుకుని అందరితో నవ్వుల పాలయ్యే ఒక డిటెక్టీవ్ చుట్టూ తిరుగుతున్నట్టు టీజర్ లో కట్ చేసారు.
మనకొచ్చే కేసులన్నీ చాలా సిల్లీగా ఉంటాయని హీరోతో చెప్పించడం దానికి తగ్గట్టే నెక్స్ట్ సీన్ లో ఒకతను మా అబ్బాయిని వెతికి పట్టుకోవడానికి మంచి డిటెక్టీవ్ ని మీరే చూసి పెట్టండి అని అడగడం అంతా తమాషాగా సాగిపోయింది. చివరిలో ఎఫ్బిఐ అని హీరో ఒకరిని బెదరించబోతే రివర్స్ లో అతను కత్తిని చూపించే సీన్ లో కామెడీ పేలింది. మొత్తానికి మరీ కడుపు పగిలిపోయే కామెడీ ఉందొ లేదో సినిమాలో తెలుస్తుంది కానీ టీజర్ మాత్రం డీసెంట్ గా కట్ చేసారు.
ఇక హీరో నవీన్ పోలిశెట్టి లుక్స్ లో మరీ ఆకట్టుకునేలా లేకపోయినా కామెడీ టైమింగ్ తో నిలబెట్టే ప్రయత్నం గట్టిగానే చేసాడు. ఇలాంటి థీమ్ తో కామెడీని పండించడం అంత ఈజీ కాదు. మరి నవీన్ దాన్ని ఎంత వరకు మోసాడో సినిమా చూసాకే చెప్పగలం. హీరోయిన్ శృతి ని ఒక్క ఫ్రేమ్ లో తప్ప ఎక్కడా చూపించలేదు. హీరో తప్ప టీజర్ లో ఇంకెవరు హై లైట్ అవ్వలేదు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ టైటిల్ కాస్త పొడుగ్గా అనిపిస్తోంది. సన్నీ కుర్రపాటి సంగీతం అందించిన ఈ మూవీకి కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్నీ ఆర్ఎస్జె స్వరూపే. షెర్లాక్ హోమ్స్ థీమ్ ని తెలుగుకరిస్తే ఎలా ఉంటుందో అచ్చం అదే ఛాయల్లో కనిపిస్తున్న ఈ ఏజెంట్ కొత్తగా అయితే ఉన్నాడు
Full View