వారు పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నారు.. కొడుకు ప్రేమపై స్టార్ సింగర్ వ్యాఖ్యలు
ఉదిత్ నారాయన్ తనయుడు ఆదిత్య ఈనెల 1న నటి శ్వేత అగర్వాల్ ను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి విషయం చాలా సైలెంట్ గా ఉంచారు. పెళ్లి తర్వాత అందరికి తెలిసింది. ముంబయిలోని ఇస్కాన్ టెంపుల్ లో ఆదిత్య.. శ్వేత అగర్వాల్ ల వివాహం అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు మిత్రుల మద్య జరిగింది. కరోనా కారణంగా పెళ్లిని సింపుల్ గా చేసినట్లుగా తెలుస్తోంది. పెళ్లి విషయమై అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులు సైతం కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉదిత్ నారాయన్ ఆ విషయమై స్పందించాడు.
ఈ విషయం కొత్తది ఏమీ కాదు. ఆదిత్యకు శ్వేతతో 12 ఏళ్లుగా పరిచయం ఉంది. వారిద్దరు 10 ఏళ్లుగా కలిసే ఉంటున్నారు. పెళ్లి అనేది వారి బంధంను అధికారికం చేసింది అంతే. ఇద్దరు కూడా చాలా కాలంగా రిలేషన్ లో ఉంటున్నారు. నేను ఆదిత్య కు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టిన సమయంలో తన ప్రేమ విషయం చెప్పాడు. ఆ సమయంలో అమ్మాయి ఎవరు ఎలా ఉంటుందో అని కాస్త భయపడ్డాను. కాని శ్వేత అని తెలిసిన తర్వాత నాకు కాస్త ఊరట దక్కింది.
నా కోడలు అతి తక్కువగా మాట్లాడుతుంది. చాలా సౌమ్యురాలు. ఆమె ఖచ్చితంగా ఆదిత్యకు మంచి జోడీ అనుకున్నాను. నా కొడుకు పెళ్లి గ్రాండ్ గా చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా సింపుల్ గా చేయాల్సి వచ్చిందని ఉదిత్ నారాయన్ అన్నారు. సినీ ప్రముఖులు పలువురు ఆదిత్య మరియు శ్వేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.