ఆ స్టార్ హీరోతో సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సెంచ‌రీ!

మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జోడీగా పేరుగాంచిన మోహన్‌లాల్ -ప్రియదర్శన్ మళ్ళీ చేతులు కలుపుతున్నారు.;

Update: 2026-04-02 06:39 GMT

మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జోడీగా పేరుగాంచిన మోహన్‌లాల్ -ప్రియదర్శన్ మళ్ళీ చేతులు కలుపుతున్నారు. ఈ సినిమాతో ప్రియ‌ద‌ర్శ‌న్ అరుదైన‌ మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమ వుతున్నారు. ప్రియదర్శన్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రమిది. త‌న‌ ఆప్తమిత్రుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో తెర‌కెక్కించ‌డం విశేషం. ఒక దర్శకుడు సెంచరీ మార్కును ఫేవరెట్ హీరోతో సెలబ్రేట్ చేసుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వాస్త‌వానికి ఈ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు గురించి గత ఏడాదే ప్రాథమిక ప్రకటన వచ్చినా వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా ప‌డింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్‌లో పట్టాలెక్కించాలని చిత్ర బృందం పక్కా ప్లానింగ్‌తో ఉంది. ప్రస్తుతం మోహన్‌లాల్ ఇతర పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రియదర్శన్ కూడా వందో సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప‌ని చేస్తున్నారు. ప్రియదర్శన్ - మోహన్‌లాల్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఒక నమ్మకం. గతంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రిలీజ్అ యిన `చిత్రం`, `కిలిక్కుమ్`, `కాలపాని` ఇటీవల వచ్చిన `మరక్కార్` వంటి సినిమాలు ఎంద పెద్ద విజ‌యం సాధించాయో తెలిసిందే.

కామెడీ, ఎమోషన్, యాక్షన్.. ఇలా ఏ జోనర్ తీసుకున్నా వీరిద్దరి మధ్య ఉండే సింక్ అద్భుతంగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ప్రియదర్శన్ 100వ సినిమాను ఏ జోనర్‌లో తీస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదొక‌ క్లాసిక్ కామెడీ డ్రామానా లేదా పీరియాడిక్ ఫిలిమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒక దర్శకుడు 100 సినిమాలు పూర్తి చేయడం అనేది సాధారణ విషయం కాదు. అందులోనూ అత్యధిక శాతం హిట్లు కలిగిన ప్రియదర్శన్ నుంచి సినిమా అంటే? అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. కెరీర్ మొత్తంలో గడించిన అను భవాన్ని, టెక్నికల్ నాలెడ్జ్‌ను ఈ వందో సినిమాలో రంగ‌రించి పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ సినిమాలో ఇతర భాషల అగ్ర నటీనటులు కూడా భాగమయ్యే అవకాశం ఉంది. డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభిస్తే 2027 ముగింపులో రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. మోహన్‌లాల్ కూడా ఈ చిత్రాన్ని అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు. లాల్ ఇప్ప‌టికే 400 సినిమాల‌కు చేరువ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇద్ద‌రి అభిమానులు వారిని మించి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇద్ద‌రి మ‌ధ్య స్నేహానికి అంకిత భావినికి గౌర‌వంగా భావిస్తున్నారు. దశాబ్దాలుగా వెండితెరపై మ్యాజిక్ చేస్తున్న ఈ జోడీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుతో మరోసారి భారతీయ సినిమాను మలయాళం వైపు చూసేలా చేస్తారని విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News