శివకార్తికేయన్ కపుల్.. ఎందుకంత స్పెషల్?

సోషల్ మీడియా యుగంలో ప్రేమ అంటే ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం లేదా విలాసవంతమైన ట్రిప్స్ వేయడం అనే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది.

Update: 2026-08-04 03:56 GMT

సోషల్ మీడియా యుగంలో ప్రేమ అంటే ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం లేదా విలాసవంతమైన ట్రిప్స్ వేయడం అనే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. సినిమా వాళ్లు అంటే ఆ హంగామా ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ నిజమైన ప్రేమకు ఇలాంటివి ఏమీ అవసరం లేదు. కష్టమైనా ఇష్టమైనా ఒకరికొకరు తోడుగా ఉన్నామనే భరోసా చాలు. నేటి జనరేషన్ కు ఈ విషయాన్ని తమ క్యూట్ ఫోటోలతో చాలా సైలెంట్ గా చెబుతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, అతని భార్య ఆర్తి.




వారిద్దరి అన్యోన్యత చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. స్టార్ డమ్ వచ్చాక చాలామంది సెలబ్రిటీల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. చిన్న వెకేషన్ కు వెళ్లినా సరే ఫోటోషూట్స్ కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటారు. ఆ ఫోటోల్లో సహజత్వం కంటే ఫ్యాషన్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ శివకార్తికేయన్ కపుల్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. వీళ్లిద్దరూ కలిసి ఉన్న కొన్ని క్యాండిడ్ మూమెంట్స్ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి.




ఎలాంటి మేకప్ హంగామా లేకుండా, చాలా నాచురల్ గా ఉన్న ఈ ఫోటోలు చూస్తే అసలైన కపుల్ గోల్స్ అంటే ఇదే కదా అనిపిస్తుంది. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా ఇంత సింపుల్ గా ఉండటం బహుశా వీరికే చెల్లిందేమో. వారిద్దరి మధ్య ఉన్న క్లారిటీ ఈ ఫోటోల ద్వారా అర్థమవుతుంది. పచ్చని ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా కూర్చుని ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ఈ ఫోటోల్లో హైలెట్ అయ్యింది.

ఆర్తి సింపుల్ రెడ్ కలర్ డ్రెస్ లో కనిపించగా, శివకార్తికేయన్ కూడా క్యాజువల్ దుస్తుల్లోనే ఉన్నారు. ఒక చోట చెక్క బెంచీ మీద భార్య ఒడిలో శివకార్తికేయన్ తలపెట్టుకుని ప్రశాంతంగా పడుకోవడం, మరో చోట ఆమె భుజంపై చేయి వేసి ప్రకృతిని ఆస్వాదిస్తూ కూర్చోవడం లాంటి మూమెంట్స్ మరో హైలెట్. ఎక్కడా కెమెరా కోసం ఇచ్చిన ఆర్టిఫిషియల్ ఎక్స్ ప్రెషన్స్ కనిపించవు. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉన్నామనే ఫీలింగ్ ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఒకవైపు పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు తన ప్రొఫెషనల్ కెరీర్ ను కూడా అంతే పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు శివకార్తికేయన్. ఆయన ప్రస్తుతం సియోన్ అనే రూరల్ యాక్షన్ డ్రామా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. దర్శకుడు శివకుమార్ మురుగేశన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విలేజ్ యాక్షన్ కు మైథలాజికల్ ఎలిమెంట్స్ కూడా జోడించి తీస్తున్నారు.

ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఒక స్టార్ హీరోగా ఇన్ని ప్రాజెక్ట్స్ తో ఇంత బిజీ షెడ్యూల్స్ లో ఉంటూ కూడా, ఫ్యామిలీ కోసం ఇలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం నిజంగా మంచి విషయం. ఇక శివకార్తికేయన్, ఆర్తి తమ సింపుల్ అండ్ క్యూట్ ఫోటోలతో కపుల్ గోల్స్ అనే పదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు.

Tags:    

Similar News