రామాయణ గ్లింప్స్.. ఆదిపురుష్ పై విమర్శలెందుకు?

ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఇలాంటి విభిన్నమైన, సవాలుతో కూడిన కథలను ఎంచుకోవడం కూడా చిన్న విషయం కాదని చెబుతున్నారు.;

Update: 2026-04-02 06:55 GMT

బాలీవుడ్‌ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం రామాయణ మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఆ భారీ ప్రాజెక్ట్ నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. గ్లింప్స్‌ లో ఆయన లుక్, ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

గ్లింప్స్‌ లో రణబీర్ కపూర్ సంప్రదాయ వేషధారణలో, శాంత స్వభావంతో, గంభీరంగా కనిపించారు. ఆయన ముఖంలో కనిపించిన ప్రశాంతత, ధైర్యం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు చూసి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్రంలో సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, రావణుడిగా యశ్ కనిపించనున్నారు.

నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఆ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో విజువల్స్, గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయిలో ఉండనున్నాయని సమాచారం. దాదాపు రూ. 4 వేల కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న చిత్రం మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే గ్లింప్స్ విడుదల తర్వాత మరో చర్చ కూడా మొదలైంది. ముంబైలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌ కు హాజరైన కొందరు ప్రముఖులు ఆ సినిమాను ప్రశంసిస్తూ.. మరోవైపు ఆదిపురుష్ సినిమాపై విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆ చిత్రంలో నటించిన ప్రభాస్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం అభిమానులను అసంతృప్తికి గురిచేసింది.

ఒక సినిమాను పొగడటం తప్పు కాదని, కానీ మరో మూవీని తక్కువ చేసి చూపించడం సరైన పద్ధతి కాదని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఆదిపురుష్ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నా, అలాంటి కథను భారీ స్థాయిలో తీసుకురావడానికి చేసిన ప్రయత్నం మాత్రం ప్రశంసనీయమే అని అభిప్రాయపడుతున్నారు.

ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఇలాంటి విభిన్నమైన, సవాలుతో కూడిన కథలను ఎంచుకోవడం కూడా చిన్న విషయం కాదని చెబుతున్నారు. యంగ్ హీరోలు చాలా మంది దూరంగా ఉండే మైథాలజికల్ జానర్‌ లో ఆయన అడుగుపెట్టడం ధైర్యంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని గుర్తించకుండా విమర్శించడం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రామాయణ విషయానికి వస్తే.. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్, ఇంటర్నేషనల్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్‌ తో సినిమా రూపొందుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలు కూడా ఆ ప్రాజెక్ట్‌ కు నేరుగా అనుబంధంగా ఉండటం వల్ల మూవీ భారతీయ సినీ చరిత్రలో కొత్త మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా రామాయణ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ, ఆదిపురుష్ ను తక్కువ చేసి మాట్లాడటం సరైన దారి కాదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఆదిపురుష్ పై విమర్శలెందుకని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News