అక్కడ టాప్‌లో ధురంధర్ డైరెక్టర్!
దీంతో ఆదిత్యధర్ ఐఎండీబీ పాపులర్ ఇండియన్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌ని ఆక్రమించాడు.;
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మూవీ `ధురంధర్ 2`. జియో పాలిటిక్స్ పరంగా సరికొత్త చర్చకు తెరలేపిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని తిరగరాస్తూ వసూళ్ల భీభత్సాన్ని సృష్టిస్తోంది. ఫస్ట్ పార్ట్ కొన్ని దేశాల్లో బ్యాన్ కావడంతో `ధురంధర్ 2`ని కూడా బ్యాన్ చేస్తారనే అనుమానాలు తలెత్తాయి. కానీ ఎక్కడా బ్యాన్‌కు గురి కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల సునామీని సృష్టిస్తూ రికార్డుల్ని తిరగరాస్తోంది. ఇప్పటికే పలు రికార్డుల్ని తరిగరాసిన `ధురంధర్ 2` సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తూ చర్చనీయాంశంగా మారింది.
మార్చి 19న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ సినిమా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో వరల్డ్ వైడ్‌గా రూ.1457 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. కేవలం విడుదలైన పదిహేను రోజుల్లోనే దాదాపు రూ.1500 కోట్ల మార్కుని చేరుకోవడం ఓ రికార్డుగా ట్రేడ్ వర్గాలు, ట్రేడ్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. ఈ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిపోయాడు దర్శకుడు ఆదిత్యధర్. దర్శకుడిగా `ధురంధర్` రెండు భాగాలతో కలిపి చేసింది మూడు సినిమాలే అయినా ఒక్కసారిగా వార్తల్లో నిలిచి దేశ వ్యాప్తంగా హాట్ అయ్యాడు.
దీంతో ఆదిత్యధర్ ఐఎండీబీ పాపులర్ ఇండియన్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌ని ఆక్రమించాడు. ప్రముఖ అంతర్జాతీయ సినీ డేటా బేస్ సంస్థ ఐఎండీబీ తాజాగా ఈ వారానికి `మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్` జాబితాను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 20 కోట్ల మందికి పైగా సందర్శించే నెటిజన్‌ల సెర్చ్, ట్రెండ్స్, పేజ్ వ్యూస్ ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధానంగా స్టార్ హీరో, హీరోయిన్‌లే అగ్రస్థానంలో నిలుస్తుంటారు.
కానీ ఈ సారి సరికొత్త రికార్డును సృష్టిస్తూ దర్శకుడు ఆదిత్యధర్ నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. దీనికి ప్రధాన కారణం ఆదిత్యధర్ తెరకెక్కించగా రీసెంట్‌గా విడుదలై సంచలనం సృష్టిస్తున్న `ధురంధర్ 2` మూవీ. రికార్డు స్థాయిలో రాకెట్ వేగంతో కలెక్షన్‌ల సునామీని సృష్టిస్తూ వరుస రికార్డుల్ని అధిమిస్తూ బాక్సాఫీస్ వద్ద `ధురంధర్ ది రివేంజ్` దూసుకుపోతోంది. ఈ మూవీతో దర్శకుడు ఆదిత్యధర్ పాపులర్ కాగా అతనితో పాటు ఈ మూవీలో నటించిన నటీనటులు కూడా ఐఎండీబీ సైట్‌లో అనూహ్య రీతిలో ఊహించని స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ జాబితాలో దర్శకుడు ఆదిత్యధర్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకోగా హీరోయిన్ సారా అర్జున్ సెకండ్ ప్లేస్‌ని దక్కించుకుంది. `ధురంధర్ 2`లో సారా అర్జున్ యలీనాగా ప్రేక్షకుల్ని ఫిదా చేయడం తెలిసిందే. అయితే హీరో రణ్‌వీర్ సింగ్ మాత్రం మూడవ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. జస్కీరత్ సింగ్ రంగీగా, హమ్జాగా తనదైన స్టైల్లో నటించి రణ్‌వీర్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో అతన్ని మూడవ స్థానం వరించింది. ఇక ఈ మూవీలో నటించిన సువీందర్ విక్కీ 18వ స్థానాన్ని, డానీష్ పాందోర్ 25వ స్థానాన్ని, మాధవన్ సహాయకుడిగా నటించిన మానవ్ గోహిల్ 38వ ప్లేస్‌ని దక్కించుకోవడం గమనార్హం.