• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోరక తీర్చమన్నారు..భోరున...

కోరక తీర్చమన్నారు..భోరున ఏడ్చా

By - Tupaki Desk
Update: 2018-07-31 06:11 GMT
కాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్ ను కుదిపేసిన ఈ వ్యవహారం మంటలు అప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. బాధితులు ఒక్కరొక్కరు ఎప్పుడో ఒక చోట తమకు ఎదురైన అనుభవాలను వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా హీరోయిన్ అదితిరావు హైదరీ స్పందించారు.. ఈ హైదరాబాదీ అమ్మాయి బాలీవుడ్ లో హీరోయిన్ గా ఫేమస్ అయ్యింది. ఇటీవలే తెలుగు తెరపై సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘సమ్మోహనం’లో నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది.

అదితి మాట్లాడుతూ ‘అవకాశం కోసం వచ్చే తారలను పట్టి పీడిస్తున్న ఈ సమస్య  ఇప్పటిది కాదు.. ఎన్నో ఏళ్లుగా ఉంది. నా కెరీర్ ఆరంభంలో ఇలాంటి సమస్య ఎదురైంది. కొందరి కోర్కెలు తీర్చలేక ఆఫర్లు వదులుకున్నాను. నాకు ఎదురైన అనుభవాలను తట్టుకోలేక భోరున ఏడ్చిన రోజులున్నాయి. అలాంటి వాటికి లొంగక ఆఫర్లు వదులుకోవడం వల్ల నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు’ అని భావోద్వేగంతో అన్నారు.

‘ఓ హిందీ సినిమాలో అవకాశం వచ్చింది. ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు కమిట్ మెంట్ అయితేనే చాన్స్ అన్నారు. నో చెప్పి ధైర్యంగా ఎదురించి మాట్లాడాను. ఆ తర్వాత ఎనిమిది నెలల పాటు నాకు అవకాశాలు రాలేదు. దాంతో నేనేమీ కుంగిపోలేదు. నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. ఇది సంతోషాన్ని కలిగిచింది.’అని అదితిరావు చెప్పుకొచ్చారు.

కొందరు సినీ ప్రముఖులు శరీరాలను ప్రేమిస్తే.. మరికొందరు నమ్ముకున్న వృత్తులను ఆరాధిస్తారని.. వారి వల్ల మనకూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని నేను బలంగా నమ్మానని అదితి పేర్కొన్నారు. అవకాశాలు కోల్పోతామనే కాస్టింగ్ కౌచ్ గురించి కొందరు బయటకు చెప్పరని.. కానీ వాటికి తలవంచకూడదని అదితి చెప్పారు.


Tags:    
  • Aditi Rao Hydari 
  • Casting Couch 
  • Film Industry 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS