కుర్ర హీరో పక్కన సూటవ్వుద్దా ?

Update: 2019-06-18 10:15 GMT
గత ఏడాది మూడు షాకులతో కొంత డిఫెన్స్ లో పడ్డ కుర్రహీరో రాజ్ తరుణ్ మెల్లగా ట్రాక్ లో పడే ప్రయత్నాలు చేస్తున్నాడు. కథల విషయంలో తొందరపడకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరి లోకం ఒకటే సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న రాజ్ తరుణ్ దీని తర్వాత విజయ్ కుమార్ కొండాకు ఓకే చెప్పినట్టు గత మూడు నెలల నుంచి టాక్ జోరుగా ఉంది.

నితిన్ తో గుండె జారీ గల్లంతయ్యిందేతో డెబ్యూతోనే హిట్ కొట్టిన ఈ దర్శకుడు నాగ చైతన్య ఒక లైలా కోసం ఫలితం ఆశించిన మేర రాకపోయాక చాల గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఓ ఫ్రెష్ కాన్సెప్ట్ తో రాజ్ తరుణ్ ని ఒప్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపో ఎల్లుండో రావొచ్చు .ఇదిలా ఉండగా ఇందులో హీరోయిన్ గా అదితి రావు హైదరిని తీసుకోబోతున్నట్టుగా ఇంకో అప్ డేట్ వచ్చింది. ఇదీ ఖరారుగా తెలియలేదు కానీ సంప్రదింపులైతే జరిగాయట.

బాలీవుడ్ లో పద్మావత్ సౌత్ లో చెలియాతో మంచి పేరు తెచ్చుకున్న అదితి సమ్మోహనంతో సక్సెస్ ట్రాక్ లో పడింది. ఇప్పుడు అదే హీరోతో వి చేస్తోంది. ఇక్కడే అవకాశాలు బాగుండటంతో హిందీ ఆఫర్స్ పెద్దగా పలకరించడం లేదు. అయితే అదితి డిమాండ్ సంగతి ఎలా ఉన్నా రెమ్యునరేషన్ మాత్రం 80 లక్షల దాకా చెబుతోందట. అంత పెట్టే పనైతే ఇంకో పీక్స్ లో ఉన్న క్రేజీ హీరోయిన్ ని సెట్ చేసుకోవచ్చు. కానీ అదితిని ఎంచుకోవడానికి కారణం ఏమైనా రాజ్ తరుణ్ పక్కన ఆదితి రావు హైదరి జోడిగా సెట్ అవుతుందా అనే అనుమానాలు అభిమానుల వ్యక్తం కాక మానవు


Tags:    

Similar News