• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్‌ గురించి...

ప్రభాస్‌ గురించి 'ఆదిపురుష్‌' డైరెక్టర్‌ వ్యాఖ్యలు వైరల్‌

By - Tupaki Desk
Update: 2021-06-26 04:48 GMT
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ గా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా లు.. చేయబోతున్న సినిమా లు రాబోయే రోజుల్లో ఆయన్ను ఇంటర్నేషనల్‌ స్టార్‌ గా నిలుపడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ఆయన అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఎంత పెద్ద స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్నా కూడా ఆయన ప్రవర్తన మాత్రం కెరీర్‌ ఆరంభంలో ఎలా అయితే ఉండేదో అలాగే ఉంటుందని ఆయనతో వర్క్‌ చేసే వారు అంటున్నారు. బాహుబలి ముందుకు ఇప్పటికి ఆయన పద్దతిలో ప్రవర్తనలో మార్పే లేదని ఎంతో మంది చెబుతూ ఉంటారు.

ప్రస్తుతం ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కు బాలీవుడ్‌ దర్శకుడు ఓమ్‌ రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే పలు సందర్బాల్లో ప్రభాస్‌ గురించి ఓమ్‌ రౌత్‌ చాలా పాజిటివ్ గా మాట్లాడాడు. ఇటీవల ఒక మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ మరోసారి ప్రభాస్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఆదిపురుష్‌ దర్శకుడు ఓమ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను ప్రభాస్ వంటి స్టార్‌ ను చూడలేదు. ఎంత పెద్ద స్టార్‌ అయినా అనుకువ ఉన్న స్టార్‌ ప్రభాస్‌. ప్రతి ఒక్కరిని కూడా ఒకే విధంగా చూసే వ్యక్తి ఆయన. అలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆయన ప్రతి సందర్బంలో కూడా తన చుట్టు ఉన్న వారికి ట్రీట్ ఇచ్చే పద్దతి మరియు ఆయన తన ఇంటి వంటను సెట్‌ లో వారితో షేర్‌ చేసుకోవడం నాకు నచ్చింది. అతను ఒక పెద్ద స్టార్‌ అయినా కూడా అలాంటి ప్రవర్తన ను నేను ఎప్పుడు చూడలేదు. ఇతర స్టార్స్ తో పోల్చితే ప్రభాస్ చాలా సింపుల్ గా.. అందరితో ఒకే విధంగా ఉంటాడు అంటూ ఓమ్‌ రౌత్‌ అన్నాడు. ఈయన ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి.
Tags:    
  • Om raut 
  • Om raut comments 
  • Adipurush 
  • Adipurush Updates 
  • Prabhas 
  • Adipurush Shooting Updates 
  • Pan India Star Prabhas 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS