• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆడవాళ్లు మీకు జోహార్లు'...

'ఆడవాళ్లు మీకు జోహార్లు' కోసం ముగ్గురు ఎవర్‌గ్రీన్ నటీమణులు..!

By - Tupaki Desk
Update: 2021-08-03 06:24 GMT
యువ హీరో శర్వానంద్ - లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''ఆడవాళ్లు మీకు జోహార్లు''. టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ తోనే ఈ సినిమాలో ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ కు మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇక 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే టైటిల్‌ అన్ని వర్గాల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి.

ఈ నేపథ్యంలో తాజాగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్ర యూనిట్ ఓ ఎగ్జైటింగ్ అనౌన్స్ మెంట్ తో వచ్చింది. ఎవర్‌ గ్రీన్ నటీమణులు ఖుష్బూ - రాధిక శరత్‌ కుమార్ మరియు ఊర్వశి ఈ ప్రాజెక్ట్‌ లో భాగం అవుతున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో చాలా కీలకమైన మూడు మహిళా పాత్రలు కోసం ముగ్గురు అత్యంత ప్రతిభావంతులైన నటీమణులను ఎంపిక చేసుకున్నారు కిషోర్ తిరుమల. ఈ ప్రత్యేకమైన చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు చాలా ప్రత్యేక పాత్రల్లో కనిపించడం కన్నుల పండుగగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఖుష్బు - రాధిక శరత్‌ కుమార్ మరియు ఊర్వశి కూడా షూట్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఆరోగ్యవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ - రవిశంకర్ - సత్య - ప్రదీప్ రావత్ - గోపా రాజు - బెనార్జీ - కళ్యాణి నటరాజన్ - రాజశ్రీ నాయర్ - ఝాన్సీ - రజిత - సత్య కృష్ణ - ఆర్‌సిఎం రాజు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్‌ ప్రసాద్‌ ఈ చిత్రానికి ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
Tags:    
  • Sharwanand 
  • Rashmika 
  • Aadavallu Meeku Joharlu 
  • Aadavallu Meeku Joharlu shooting 
  • Kishore Tiumala 
  • Radhika sharatKumar 
  • Uravshi 
  • Khushbu 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS