టైసన్ కు కిస్ ఇస్తున్న మిస్ తేజస్వి!
అచ్చ తెలుగు హీరోయిన్ తేజస్వి మదివాడకు టాలీవుడ్ లో ఆఫర్లయితే చాలానే వచ్చాయి కానీ బ్రేక్ అయితే రాలేదు. కెరీర్ డౌన్ అయింది అనుకున్న సమయంలో బిగ్ బాస్ లో పాల్గొని మళ్ళీ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ గుర్తింపుతో మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయని అనుకుంటే అలా ఏం జరగలేదు. సీనియర్ బ్రహ్మానందం తో కలిసి ఒక టీవీ షోలో పాల్గొన్నా అది కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ వీటితో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో పోస్టులు పెడుతూ నెటిజనులను ఆకట్టుకుంటోంది.
ఎప్పుడు గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేసే తేజస్వి ఈ సారి మాత్రం తన ప్రియమైన శునకంతో ఫోటో దిగి ఆ ఫోటోలను పోస్ట్ చేసింది. తన పెట్ డాగ్ పేరు టైసన్. ఈ ఫోటోలకు తేజస్వి ఇచ్చిన క్యాప్షన్ "ఒక ఏడాది టైసన్ కు చాలా ఎక్కువ సమయం. ఈ ఒక్క ఏడాదిలోనే ఎంత పెద్దగా అయిందో.. ఇదంతా బ్యూటిఫుల్." టైసన్ చిన్నగా ఉన్నప్పుడు.. టైసన్ మైక్ టైసన్ లా మారినప్పుడు ఇలా వివిధ దశలలో ఫోటోలన్ని పెట్టింది. ఎంతైనా పెంపుడు జంతువులను పెంచుకునేవారికి అదో మురిపెం.
ఇదిలా ఉంటే ఒక ఫోటోలో టైసన్ కు కిస్ ఇస్తున్నట్టుగా ముద్దుగా మూతి పెట్టింది. దీంతో నెటిజనులు టైసన్ పప్పీ ఎంత లక్కీనో.. అంటూ అసూయపడుతున్నారు. టైసన్.. పప్పీ.. ఫోటోలు. అంతాబాగానే ఉంది కానీ తేజస్వి నెక్స్ట్ సినిమా ఎప్పుడో మరి.