• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టబు ని బుట్టలో వేసుకున్న...

టబు ని బుట్టలో వేసుకున్న ఆ స్టార్ హీరోలు ఎవరు..?

By - Tupaki Desk
Update: 2020-05-25 02:30 GMT
'కూలీ నెం. 1' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది అందాల టబు. కింగ్ నాగార్జున నటించిన 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు మిగతా హీరోయిన్స్ కి పోటీ ఇచ్చింది. దాదాపు అన్ని ఇండస్ట్రీలలో స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసింది టబు. టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ లతో రొమాన్స్ చేసింది. ఇదిలా ఉండగా టబు ప్రస్తుత వయసు 48 ఏళ్ళు. ఈ హీరోయిన్ తో పాటు వచ్చిన చాలా మంది హీరోయిన్స్ ఈపాటికే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. కానీ టబు మాత్రం ఇంకా సింగిల్ గానే తన జీవితాన్ని గడుపుతోంది. ఇంటర్వ్యూలలో పెళ్లెందుకు చేసుకోలేదనే ప్రశ్నకు ఎదో ఒక ఆన్సర్ చెప్పి తప్పించుకుంటూ వస్తోంది. హీరో హీరోయిన్స్ విషయంలో అఫైర్స్ - లవ్ బ్రేక్ అప్స్ వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. ప్రేమలో పడటం.. కొన్నాళ్ళు డేటింగ్ చేయడం.. అన్నీ కుదిరితే పెళ్లి చేసుకోవడం.. కుదరకపోతే విడిపోయి వేరే వారితో జత కట్టడం.. పెళ్లి చేసుకున్నా ఇద్దరికీ కుదరకపోతే విడిపోవడం.. మళ్ళీ వేరే వారిని పెళ్లి చేసుకోవడం.. ఇలాంటివన్నీ సినీ ఇండస్ట్రీలో కామన్ గా జరిగే విషయాలు. అయితే అలాంటి సంఘటనలే టబు లైఫ్ లో కూడా జరిగాయట.

వివరాల్లోకి వెళ్తే టబు అప్పట్లో ఒక టాలీవుడ్ స్టార్ హీరోను ప్రేమించి.. పెళ్లికి కూడా సిద్దమైనట్లు కథనాలు కూడా వచ్చాయి. ఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన రోజున ఊహించని విధంగా స్టార్ హీరో కుటుంబ సభ్యులు వారి వివాహాన్ని చెడగొట్టినట్లు అప్పట్లో అనేక రూమర్స్ వచ్చాయి. అయితే ఆ తరువాత ఆ హీరో మరో పెళ్లి చేసుకోవడంతో దాదాపు టబు టాలీవుడ్ కి దూరమయ్యింది. బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిన టబుకి అక్కడ మంచి క్రేజ్ దక్కింది. కానీ అక్కడ కూడా మరొక స్టార్ హీరోను ప్రేమించిన టబు పెళ్లి చేసుకోవాలని అనుకుందట. కానీ అక్కడ కూడా మళ్ళీ టబుకి చేదు అనుభవమే ఎదురైందట. ఆ బాధ నుంచి కొలుకోవడానికి కూడా ఈ బ్యూటీకి చాలా సమయం పట్టిందట. టబు ని ప్రేమించి వదిలేసి ఆమెను విరహ వేదనకు గురి చేసిన ఆ స్టార్ హీరోస్ ఎవరో మరి.

ఇదిలా ఉండగా టబు పెళ్లిపై చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నా పెళ్లి పై ఒక్కసారి కూడా క్లారిటీ ఇవ్వలేదు. రూమర్స్ గురించి పట్టించుకోకుండా కేవలం తన కెరీర్ పైనే దృష్టి పెట్టి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రెండుసార్లు లవ్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆమెకు పెళ్లిపై నమ్మకం పోయిందట. అందుకే పెళ్లి తనకు అవసరం లేదని ఒక నిర్ణయానికి వచ్చిందట. కాకపోతే చాలా మంది హీరోయిన్స్ లేటు వయసులో కూడా పెళ్లి పీటలెక్కడం మనం చాలానే చూసాం. మరి టబు కూడా తనకు నచ్చిన వాడు దొరికితే తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమో చూడాలి.
Tags:    
  • Actress Tabu 
  • Marriage 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS