• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ నెంబర్‌.. ఆ అకౌంట్స్...

ఆ నెంబర్‌.. ఆ అకౌంట్స్ రెండూ ఆమెవి కాదట!

By - Tupaki Desk
Update: 2022-03-06 02:30 GMT
టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది మోసాలు చేసే వారు కొత్త పద్దతులను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈమద్య కాలంలో పేక్ అకౌంట్లు... ఫేక్ ఫోన్ నెంబర్స్ తో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. సెలబ్రెటీ పేరు మీద ఫేక్ సోషల్‌ మీడియా అకౌంట్స్ ను క్రియేట్‌ చేయడం మనం ఇప్పటి వరకు చూశాం. తాజాగా నటి సురేఖ వాణి ఫోన్ నెంబర్‌ అంటూ ఒక నెంబర్‌ తెగ ప్రచారం జరుగుతోంది.

ఆ ఫోన్‌ నెంబర్‌ వాట్సప్‌ కు సురేఖ వాణి డీపీ ఉండటంతో పాటు ఆమె పేరుతోనే ట్రూ కాలర్‌ లో కూడా చూపిస్తోంది. దాంతో ఎక్కువ శాతం మంది ఆ నెంబర్‌ సురేఖ వాణి నెంబర్‌ గా భావించి మోసపోతున్నారు. అసలు విషయం ఏంటీ అంటే ఒక విదేశీ నెంబర్‌ నుండి తాను సురేఖ వాణిని అంటూ కాల్స్ మరియు మెసేజ్ లు వస్తున్నాయట. మెల్లగా మాట్లాడుతూ.. చాట్ చేస్తూ మోసానికి పాల్పడుతున్నట్లుగా సురేఖ వాణి దృష్టికి వచ్చిందట.

వెంటనే తన పేరుతో జరుగుతున్న మోసంను సోషల్‌ మీడియా ద్వారా జనాలకు తెలిజేసేందుకు ముందుకు వచ్చింది. వెంటనే జనాలు అప్రమత్తం అవ్వాలంటూ ఆమె కోరింది. ఆ నెంబర్ ను కూడా షేర్‌ చేసి ఈ నెంబర్‌ నుండి ఎలాంటి కాల్స్ లేదా మెసేజ్ లు వచ్చినా కూడా స్పందించవద్దని ఆమె కోరింది. తనకు ఆ నెంబర్ కు అసలు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. తన పేరుతో ఎవరో మోసానికి పాల్పడుతున్నారని పేర్కొంది.

సురేఖ వాణి మరియు ఆమె బ్రాండ్ ఇమేజ్ ను ఉపయోగించుకుని డబ్బును సంపాదించే లక్ష్యం తో కొందరు ఇలా ఫేక్‌ ఫోన్ నెంబర్‌ లతో బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరి కొందరు సోషల్‌ మీడియా లో ఫేక్ అకౌంట్స్ ను క్రియేట్‌ చేసి జనాలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో సురేఖ వాణి నుండి స్పందన రావడం అభినందనీయం.

తనకు ఇన్‌ స్టా లో తప్ప ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో అకౌంట్‌ లేదు అంటూ క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి సోషల్‌ మీడియా ద్వారా కాని మరే విధంగా అయినా కాని తన పేరు తో మోసగించేందుకు మోసగాళ్లు ప్రయత్నించవచ్చు. కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని.. ఏదైనా అనుమానం ఉంటే తనకు ఇన్ స్టా ద్వారా తెలియజేయవచ్చు అంటూ పేర్కొంది. తన పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ ఆమె హెచ్చరించారు.
Tags:    
  • Surekha Vani 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS