ఎవ‌రికైనా చివ‌రికి ఆధ్యాత్మిక‌తే గ‌తి!

Update: 2023-01-16 00:30 GMT
అన్నీ బావుంటే ఎగిరెగిరి ప‌డ‌డం .. ఉన్న‌ట్టుండి కింద‌ప‌డ్డాక కుంగిపోవ‌డం మాన‌వ నైజం. అయినా ఇది కాదు జీవితం అంటే..! గొప్ప‌గా బతికిన రోజుల్ని కింద‌ప‌డిన‌ప్ప‌టి రోజుల్ని స‌మానంగా చూడ‌గ‌లిగినప్పుడే ఎవ‌రైనా నిల‌దొక్కుకోగ‌ల‌రు. ఊహ‌ల లోకంలో విహ‌రించి ఆశ‌ల ప‌ల్ల‌కీని మోయ‌లేక చ‌తికిల‌బ‌డ‌డం స‌రికాదు! కానీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో అల్లాడిపోయిన బుట్ట బొమ్మ వ్య‌వ‌హారం చూస్తుంటే బాగా బెంగ పెట్టుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. 2022 పూజాకి ఏమాత్రం క‌లిసి రాని ఏడాది. వ‌రుస‌గా భారీ చిత్రాలు డిజాస్ట‌ర్లుగా మిగిలాయి.

ప్రభాస్ -రాధే శ్యామ్.. విజయ్- బీస్ట్.. రణ్‌వీర్ సింగ్- సర్కస్ వంటి చిత్రాలు పెద్ద ఫ్లాపులుగా మిగిలాయి. ఈ ఫ్లాపుల‌తో పూజా కెరీర్ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఒకే ఏడాది ఇలాంటి భారీ ఫ్లాపులు త‌న‌ని తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చ‌డంతో ఇప్పుడు కుజ‌దోషం పైనా రాహుకేతువు పైనా దృష్టి సారించింద‌ని తెలిసింది.

అంతేకాదు.. త‌న‌కు అర‌వింద స‌మేత‌- అల వైకుంఠ‌పుర‌ములో లాంటి  బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను ఇచ్చిన గురుడు త్రివిక్ర‌మ్ స‌ల‌హాల‌ను తూ.చ త‌ప్ప‌క ఈ క‌ష్ట‌కాలంలో పాటిస్తోంద‌ట‌. అనుకున్న‌వేవీ స‌రిగా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో పూజా మాయావి స‌ల‌హా కోరిందిట‌. దీంతో  గుడులు గోపురాల‌కు వెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు ఆచ‌రించాల‌ని దాన‌ధ‌ర్మాలు చేయాల‌ని మాయావి త్రివిక్ర‌మ్ స‌ల‌హా ఇచ్చార‌ట‌. దీంతో పూజా గుడుల చుట్టూ తిరుగుతోంది. తోచిన కాడికి దాన‌ధ‌ర్మాలు చేస్తోంది. ఇటీవ‌ల ఎంతో నిష్ఠ‌గా ఉంటోంది.

అలా హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్ద‌మ్మ గుడి వ‌ద్ద పూజ‌లాచ‌రిస్తూ క‌నిపించింది. మొత్తానికి త‌న‌కు రాహుకేతు చిక్కులేవో ఉన్నాయ‌ని అమ్మ‌వారిని పూజిస్తే అవ‌న్నీ తొలిగిపోతాయ‌ని త్రివిక్ర‌ముడు నూరి పోశాడో ఏమో కానీ పూజా తూ.చ త‌ప్ప‌క దోష నివార‌ణ పూజ‌లాచ‌రిస్తోంది. ఇంత‌కుముందు అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ సైతం కాళ‌హ‌స్తి కి వెళ్లి కొన్ని ప్ర‌త్యేక పూజ‌లు చేయించిన సంగ‌తి తెలిసిందే. ఎంత ఎగిరిప‌డినా  వ‌న్ ఫైన్ డే స‌మ‌స్య‌ల సుడిగుండంలో  చిక్కుకోవ‌డం ఖాయం. వ‌రికైనా చివ‌రికి ఆధ్యాత్మిక‌తే గ‌తి!
Tags:    

Similar News