`గుడ్ బై` చెప్పేసి..దేవుడిపై భారం వేసిన రష్మిక!
నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న బాలీవుడ్ కెరీర్ పై దృష్టిపెట్టి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్ లు లైన్ లో పెడుతూ అమ్మడు వేగాన్ని అంతకంకు పెంచుతుంది. `పుష్ప` తెచ్చిన పాన్ ఇండియా ఐడెంటిటీ అమ్మడికి వరంగా మరుతుంది. ట్యాలెంట్ తో పాటు అందం..అభినయం రష్మకని ఉత్తరాదిన బిజీ స్టార్ గా మార్చుతున్నాయి.
మూడు నాలుగు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నా...ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే కొత్త అవకాశాలు ఒడిసిపట్టుకుంటుందంటే బ్యూటీ క్రేజ్ ఏ రేంజ్ లో వెలిగిపోతుందన్నది అద్దం పడుతుంది. ముందుగా బాలీవుడ్ లో `మిషన్ మజ్ను` సినిమాతో ప్రేక్షకులు రావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ డిలే అవుతోంది.
ఈ నేపథ్యంలో లెజండరీ నటుడు బిగ్ బీ అమితాబచ్చన్ చిత్రంతోనే ముందుగా హిందీ ప్రేక్షకుల్ని మెప్పించడానికి రెడీ అవుతోంది. అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో...రష్మిక మందన్న..నీనా గుప్తా.. సునీల్ గ్రోవర్.. పావలి గులాటీ కీలక పాత్రలో వికాస్ బహల్ దర్శకత్వంలో `గుడ్ బై` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్...ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది.
పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అమితాబ్ బచ్చన్ రష్మిక మందన్న పాప్‌కార్న్ తింటూ మ్యాచ్ ని ఆఆస్వాదిస్తున్నారు. అమితాబ్ సీరియస్ గా టీవీవైపు దృష్టి మళ్లించగా..రష్మిక పాప్ కార్న్ సంగతేంటో చూస్తుంది. మిగిలిన కుటుంబ సభ్యులు మ్యాచ్ ఆస్వాదనలో తలమునకలయ్యారు. ఇది మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ కథ.
సాధారణ కుటుంబ జీవితాన్ని ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే అంశాలతో తెరకెక్కిస్తున్నారు. కుటుంబ బంధాలు..బావోద్వేగాల సమ్మేళనమే గుడ్ బై ప్రధాన థీమ్ గా కనిపిస్తుంది. సంతోషంగా సాగిపోతన్న వారి జీవితాల్లో అనుకోని ఓ ఘటనతో ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లారు? అన్నది కథలో హైలైట్ చేస్తున్నారు. ఇందులో రష్మిక పాత్ర ప్రధానంగా హైలైట్ కానుంది. అమ్మడి పాత్రకి పూర్తి స్థాయిలో నటనకు ఆస్కారం కనిపిస్తుంది. ఈ సినిమాతో రష్మికకి నటిగా ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తుంది.
``నువ్వు ఈ ప్రత్యేకమైన సినిమాలో నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నావో దేవుడికే తెలుసు. నువ్వు గర్వించేలా నటించానని నేను అనుకుంటున్నాను. నీనా గుప్తాను మిస్ అవుతున్నాను. నేను ఇంకా ఎంత సేపు అయినా చెప్పగలను. కానీ.. ఇక్కడే ఆపుతున్నాను. సినిమా చూడటానికి అందరు సిద్ధంగా ఉండండి`` అని రష్మిక మందన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఇక సినిమా షూటింగ్ కూడా ముగించినట్లు ఈ సందర్భంగా రివీల్ చేసారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తిచేసి అక్టోబర్ 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో ఇంకా ఎల్లి అవ్రామ్.. సునీల్ గ్రోవర్ సాహిల్ మెహతా ఇతర కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్- రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై ఏక్తా కపూర్-శివాశిస్ సర్కార్ నిర్మిస్తున్నారు.