టాలీవుడ్ రీ ఎంట్రీకి సోపేస్తున్న క్యూట్ బ్యూటీ

Update: 2022-08-07 04:43 GMT
టాలీవుడ్ యంగ్‌ స్టార్‌ హీరోల్లో దాదాపు అందరితో నటించిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఒకానొక సమయంలో సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు వంటి హీరోల సినిమాలను కూడా డేట్లు లేవు అనే ఉద్దేశ్యంతో కాదన్నంత బిజీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్ కెరీర్ సాగింది. అలాంటి రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో ఆఫర్ల కోసం వెదుక్కోవాల్సి వచ్చింది. అయితే అదృష్టం ఏంటీ అంటే ఈ అమ్మడు సౌత్ లో ఆఫర్లు తగ్గిన సమయంలో బాలీవుడ్ వెళ్లింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడి టైమ్ నడుస్తోంది. పది సినిమాలకు పైగా ఈమె చేతిలో ఉన్నాయి. అందులో కొన్ని సినిమా లు షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి. మొత్తంగా రకుల్‌ ప్రీత్ సింగ్‌ బాలీవుడ్‌ లో రాబోయే రెండేళ్ల వరకు ఫుల్‌ బిజీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని హిందీ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రయోజనం తక్కువే అనేది చాలా మంది అభిప్రాయం.

బాలీవుడ్‌ లో గుర్తింపు ఎంత వరకు వస్తుందో క్లారిటీ లేదు. అందుకే బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌ లో కూడా మళ్లీ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవాలనే ప్రయత్నాలను రకుల్‌ చేస్తోంది. అందుకే తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ను మరియు తెలుగు ప్రేక్షకులను ప్రశంసిస్తూ ఈమధ్య వ్యాఖ్యలు చేస్తూ ఉంది.

తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల వల్లే తాను ఈ స్థితిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. వారు నన్ను ఆధరించారు అలాగే వారు నన్ను అభిమానించారు. అందుకే తాను టాలీవుడ్ లో అందరు స్టార్‌ హీరోలతో నటించాను అంటూ చెప్పుకొచ్చింది. రకుల్‌ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మళ్లీ టాలీవుడ్‌ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తుందనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌ లో అన్ని సినిమాలు చేస్తున్నా కూడా టాలీవుడ్ పైనే ఆమెకు మక్కువ అంటే తెలుగు సినిమా యొక్క క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News