శ్రీలీల ఇప్పుడంత సున్నితం కాదు!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల పరిచయం అవసరం లేని పేరు. తెలుగు నటిగా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతోన్న నటి.;
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల పరిచయం అవసరం లేని పేరు. తెలుగు నటిగా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతోన్న నటి. తెలుగు అవకాశాలను సైతం కాదని ఇతర భాషలపై ఆసక్తి చూపించే రేంజ్ కి అమ్మడు చేరుకోవడం విశేషం. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఎంతో సున్నితంగా ప్రతి చిన్న విషయానికి స్పందించే మనస్తత్వంతో ఉండేదాన్ని అంది. కానీ ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్నానని తెలిపింది. ఇండస్ట్రీలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలు, సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వచ్చే విమర్శలే తనలో ఈ పరిణతికి కారణమని అమ్మడు పేర్కొంది.
కెరీర్ ప్రారంభంలో శ్రీలీల వరుస విజయాలతో దూసుకుపోయింది. ఆ సమయంలో వచ్చిన విమర్శలను ఆమె ఎంతో సున్నితంగా తీసుకునేదట. ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నా? లేదా సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చూసినా ?మనస్తాపానికి గురయ్యేదాన్నని ఇంటర్వ్యూలో వెల్లడించింది. అప్పట్లో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతో అందంగా ఊహించుకున్నానని కానీ సినిమా ఇండస్ట్రీలోని వాస్తవ పరిస్థితులు తనను మరింత స్ట్రాంగ్‌గా మార్చాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా శ్రీలీలకు బాక్సాఫీస్ వద్ద కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి.
వరుసగా పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఒకప్పుడు పొగిడిన వారే విమర్శించడం చూసి మొదట్లో బాధపడినా, ఆ తర్వాత వాటన్నింటినీ స్వీకరించడం నేర్చుకున్నానని ఆమె తెలిపింది. `ఇప్పుడు నేను అంత సున్నితం కాదు, విమర్శలను ఎదుర్కొనే ధైర్యం నాకు వచ్చింది` అని అమ్మడు ధీటుగా సమాధానమిచ్చింది. పరిశ్రమలో నెగ్గుకురావాలంటే కేవలం నటన మాత్రమే సరిపోదని, మానసిక స్థైర్యం కూడా చాలా అవసరమని శ్రీలీల గ్రహించింది.
షూటింగ్ సెట్స్‌లో ఎదురయ్యే ఒత్తిడిని, ప్రొఫెషనల్ లైఫ్‌లో వచ్చే ఒడిదుడుకులను తట్టుకోవడానికి తన సున్నితత్వాన్ని పక్కన పెట్టి ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏ నిర్ణయమైనా ఆవేశంతో కాకుండా ఆలోచనతో తీసుకుంటున్నానని, తన కెరీర్ గ్రాఫ్‌ను మళ్ళీ గాడిలో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అమ్మడు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ఈ మార్పు కేవలం తన వ్యక్తిగత జీవితానికే కాకుండా, వృత్తిపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని ఆమె భావిస్తోంది. ఇప్పుడు ఆమె కథల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటోంది.
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తనలోని నటిని నిరూపించుకునే బలమైన పాత్రల కోసం ఎదురు చూస్తోంది. తనపై వచ్చే విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లడమే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఏకైక మార్గమని ఆమె ఇన్నేళ్ల ప్రయాణంలో తెలుసుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాల కంటే బాలీవుడ్ చిత్రాలకే పెద్ద పీట వేస్తోన్న సంగతి తెలిసిందే.
మొత్తానికి, 'నేషనల్ క్రష్' నుంచి 'పవర్‌ఫుల్ పర్సనాలిటీ'గా శ్రీలీల మారుతున్న తీరు ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాలమే మనకు పాఠాలు నేర్పుతుందని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. మరి ఈ కొత్త శ్రీలీల తన సెకండ్ ఇన్నింగ్స్‌లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. తనపై నమ్మకం ఉంచిన ప్రేక్షకులకు మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడమే తన తదుపరి లక్ష్యమని ఆమె స్పష్టం చేసింది.