బాలీవుడ్ స్టార్ తో వంశీపైడిప‌ల్లి ముహూర్తం ఫిక్స్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి వార‌సుడు త‌ర్వాత ఖాళీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-03-23 07:36 GMT

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి వార‌సుడు త‌ర్వాత ఖాళీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోలంతా బిజీగా ఉండ‌టంతో హిట్ సినిమాలున్నా ఖాళీగా ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే ఎట్ట‌కేల‌కు బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తో ఓ ప్రాజెక్ట్ సెట్ అవుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. తాజాగా అదంతా నిజ‌మేనని తేలింది. ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య స్టోరీ లాక్ అయింది. ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించ‌డానికి ముందుకొస్తున్నారు. దీంతో టాలీవుడ్ ,బాలీవుడ్ వర్గాల్లో ఈ కాంబినేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్ నెల నుంచే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.

ఈ ప్రాజెక్ట్ కోసం వంశీ పైడిపల్లి గత ఏడాది కాలంగా పక్కా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, అదే సమయంలో వంశీ మార్కు ఎమోషన్స్ , స్టైలిష్ యాక్షన్ కలగలిసిన కథను వంశీ రూపొందించినట్లు తెలుస్తోంది. సల్మాన్ కూడా కథ విని ఎంతో ఇంప్రెస్ అయ్యారని అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఏప్రిల్‌లో ముహూర్తం షాట్‌తో షూటింగ్ ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాతో బాలీవుడ్ మార్కెట్‌లో తన ముద్ర వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఇప్పటికే తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్లను అందించిన ఆయన సల్మాన్ ఖాన్ వంటి గ్లోబల్ స్టార్‌తో సినిమా చేయడం వల్ల ఈ ప్రాజెక్టుకు పాన్-ఇండియా వ్యాప్తంగా భారీ బిజినెస్ జరిగే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దిల్ రాజు ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది.

వంశీ పైడిపల్లి సినిమాల్లో హీరోలను చాలా స్టైలిష్‌గా ఎనర్జిటిక్‌గా చూపిస్తుంటారు. బృందావనం, ఎవడు, మహర్షి చిత్రాల్లో హీరోల క్యారెక్టరైజేషన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌ను ఆయన ఏ రేంజ్‌లో ప్రెజెంట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

బాలీవుడ్ ఆడియన్స్‌కు నచ్చే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, సౌత్ ఇండియన్ టేకింగ్ స్టైల్ ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో రాజా శివాజీ, మాతృభూమి చిత్రాల్లో న‌టిస్తున్నారు. వాటితో సంబంధం లేకుండా వంశీ పైడిపల్లి ప్రాజెక్టుకు ప్రత్యేకంగా డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఏప్రిల్ నుంచి షెడ్యూల్స్ ప్లాన్ చేయడంతో ఈ ఏడాది చివరికల్లా లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా వంశీ పైడిపల్లి బాలీవుడ్‌లో అడుగు పెట్ట‌డం విశేషం. మొత్తానికి టాలీవుడ్ డైరెక్టర్ - బాలీవుడ్ సూపర్ స్టార్ - క్రేజీ ప్రొడ్యూసర్ కలిస్తే వచ్చే కిక్కు ఎలా ఉంటుందో ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద చూడబోతున్నాం. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, హీరోయిన్ ,ఇతర నటీనటుల పేర్లు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.

Tags:    

Similar News