ఈవారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలు రాలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్న సినీ ప్రేక్షకుల కోసం గత వారం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, ధురంధర్‌ 2 సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే.;

Update: 2026-03-23 07:35 GMT

సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలు రాలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్న సినీ ప్రేక్షకుల కోసం గత వారం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, ధురంధర్‌ 2 సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఫ్యాన్స్‌ను మెప్పించే విధంగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా సాగితే, మొత్తం ఇండియన్ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించే విధంగా ధురంధర్ 2 సాగింది. వందల కోట్ల వసూళ్లు రాబడుతూ ధురంధర్‌ 2 వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుకుంటూ దూసుకు పోతుంది. ఇప్పటి వరకు నమోదు అయిన రికార్డులన్నింటిని ధురంధర్‌ 2 బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దంగల్‌, బాహుబలి 2 రికార్డ్‌లను సైతం ఈ సినిమా బీట్‌ చేస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

ధురంధర్‌ 2 వసూళ్లు....

ఇప్పటికే చాలా రికార్డ్‌లను అలవోకగా బ్రేక్‌ చేసిన ధురంధర్‌ 2 సినిమా ను ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ బాక్సాఫీస్‌ వద్ద ఆ సినిమా చేస్తున్న సందడి చూస్తూ ఉంటే ఓటీటీలో రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవైపు ధురంధర్‌ 2 థియేటర్‌లో సందడి చేస్తూ ఉంటే, ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు వినోదాల విందు అందించేందుకు పలు సినిమాలు, సిరీస్‌లు ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రతి వారం ఓటీటీ ద్వారా పదుల కొద్ది సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కావడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ప్రేక్షకులు ప్రతి వారం ఓటీటీలో రాబోతున్న సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈవారం ప్రముఖ ఓటీటీల్లో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, సిరీస్‌లు, షో లు ఇలా చాలా పెద్ద మొత్తంలో స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ వారం చాలా స్పెషల్‌ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.

డేర్‌ డెవిల్‌ సీజన్ 2....

జియో హాట్‌ స్టార్‌లో 'డేర్‌డెవిల్: బోర్న్ అగైన్' సీజన్ 2 ఈవారం స్ట్రీమింగ్‌ కాబోతుంది. దాంతో పాటు కాట్టాన్‌ అనే తమిళ మిస్టరీ థ్రిల్లర్‌ సైతం ఈ వారంలోనే స్ట్రీమింగ్‌కు రెడీ కాబోతుంది. అంతే కాకుండా ఏఐ మహాభారత్‌ కొత్త ఎపిసోడ్‌ సైతం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈటీవీ విన్‌ ద్వారా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలో శివాజీ, లయ ముఖ్య పాత్రల్లో నటించారు. థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోని ఈ సినిమా ఓటీటీ ద్వారా మెప్పిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మార్చి 22 నుంచి స్క్రీనింగ్‌ మొదలైంది. ఇక ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా ఈటీవీ విన్ ద్వారా కథాసుధ కొత్త ఎపిసోడ్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈటీవీ విన్‌ ద్వారా ఈ వారం కూడా కొత్త కంటెట్‌ ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతుంది.

బీటీఎస్ : ది రిటర్న్‌...

ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రతివారం మాదిరిగానే ఈ వారం పెద్ద ఎత్తున కంటెంట్‌ రాబోతుంది. ఇంగ్లీష్‌తో పాటు పలు భాషలకు చెందిన కంటెంట్‌ను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌కు రెడీ చేసింది. ముఖ్యంగా సమ్‌థింగ్‌ వెరీ బ్యాడ్‌ ఈజ్ గోయింగ్‌ టు హ్యాపెన్‌ అనే హర్రర్‌ సిరీస్ స్ట్రీమింగ్‌ మొదలైంది. ఇప్పటికే ప్రేక్షకులు ఈ సిరీస్‌ను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. డిటెక్టివ్‌ హోల్‌ అనే థ్రిల్లర్‌ సిరీస్‌ ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఒక డిటెక్టివ్‌ ఎలా హత్యల కేసును సాల్వ్‌ చేశాడు అనే కథాంశంతో ఈ సిరీస్ సాగుతుంది. బీటీఎస్ సిరీస్‌లో కొత్త సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బీటీఎస్ : ది రిటర్న్‌ అనే టైటిల్‌తో డాక్యుమెంటరీని మార్చి 27 నుంచి స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. మొత్తానికి ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పెద్ద ఎత్తున సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News