పాన్ ఇండియా హీరోని అలా కాకా ప‌డుతోందా?

Update: 2022-08-01 02:30 GMT
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలిగాక బాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వాల‌ని క‌ల‌గ‌నే నాయిక‌లు ఎంద‌రో. అదే కేట‌గిరీలో అందాల ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా ఆరంభం టాలీవుడ్ కోలీవుడ్ లో ల‌క్ చెక్ చేసుకుంది. ఇక్క‌డ అగ్ర నాయిక‌గా ఎదిగింది. ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌స‌న వ‌రుస‌గా అవ‌కాశాల్ని అందుకుంది. కానీ ఇంత‌లోనే సడెన్ గా ఫేట్ మారిపోయింది. కొన్ని వ‌రుస ఫ్లాప్ లు ర‌కుల్ ని బ్యాక్ బెంచీలోకి నెట్టేశాయి. స్టార్ హీరోలు ఈ అమ్మ‌డిని ఐర‌న్ లెగ్ గా భావించి దూరం పెట్టేయ‌డంతో అటుపై న‌వ‌త‌రం హీరోల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ప్రారంభించింది.

ర‌కుల్ న‌టించిన చివ‌రి చిత్రం కొండ పొలం. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న ఈ చిత్రంలో న‌టించింది. కానీ ఇది కూడా పెద్ద ఫ్లాప్ షోగా మిగిలింది.  ఆ త‌ర్వాత ఇక తెలుగులో అవ‌కాశాలేవీ రాలేదు. అగ్ర హీరోలు త‌న‌ని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. అదే క్ర‌మంలో తెలివిగా మ‌కాం ముంబైకి మార్చేసింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లోనే వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేస్తోంది. అయితే ఇవేవీ కూడా త‌న స్టార్ డ‌మ్ ని పెంచేంత పెద్ద ఆఫ‌ర్లు కాద‌ని కూడా తేలిపోయింది. నిజానికి టాలీవుడ్ ని ర‌కుల్ వ‌దిలి వెళ్లేందుకు కార‌ణం త‌న‌కు ల‌క్ క‌లిసి రాక‌పోవ‌డంతో పాటు కేవ‌లం గ్లామ్ డాళ్ త‌ర‌హా పాత్ర‌లే ఆఫ‌ర్ చేయ‌డ‌మేన‌ని తెలిసింది. అలాగే త‌న ఎంపిక‌ల్లో వైఫ‌ల్యం ల‌క్ క‌లిసి రాక‌పోవ‌డం కూడా స్ప‌ష్టంగా క‌నిపించింది.

అయితే బాలీవుడ్ లో అంతకు మించి సాధించేదేమీ లేద‌ని.. గ్లామ‌ర్ ప‌రంగా డోస్ పెంచి క‌నిపిస్తోంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల టాలీవుడ్ సైతం బాలీవుడ్ ని మించిపోతోంది. ఇక్క‌డా గ్లామ‌ర్ కంటెంట్ త‌క్కువేమీ కాదు. పైగా పాన్ ఇండియా సినిమాల‌తో గొప్ప స‌క్సెస్ రేటుతో దూసుకెళుతోంది మ‌న ప‌రిశ్ర‌మ‌. అందుకే ఇప్పుడు తిరిగి ర‌కుల్ తెలుగు సినీరంగం వైపు చూస్తోంద‌ట‌. తాజాగా మాషూకా అంటూ సాగే ప్ర‌యివేట్ ఆల్బ‌మ్ లో న‌ర్తించిన ర‌కుల్ ఈ పాట‌ను `సరైనోడు` సహనటుడు అల్లు అర్జున్ తో లాంచ్ చేయించింది. అత‌డి నుంచి ఏదైనా స‌పోర్ట్ కోరుతూ రెక్వ‌స్ట్ చేయ‌డ‌మే ఇది అని భావిస్తున్నారు అభిమానులు. అస‌లే పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హిట్టు కొట్టి జోష్ మీదున్న గురుడితో ర‌కుల్ ట‌చ్ లో ఉందంటే ఏదో జ‌రుగుతోంద‌నే భావించాలి.

మొత్తానికి తిరిగి తెలుగు హీరోల‌ను కాకా ప‌ట్టే ప‌నిలో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ఇది ఎంత‌వ‌ర‌కూ వ‌ర్క‌వుట‌వుతుంది? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పుడు సెట్స్ పై ఉన్న వాటిలో ఒక పెద్ద బంప‌ర్ హిట్ కొడితే ఆ త‌ర్వాత కూల్ కూల్ ర‌కుల్ స‌న్నివేశం అమాంతం మారుతుందేమో!
Tags:    

Similar News