ఈర్ష్య... రకుల్ ప్రీత్ కొత్త యాంగిల్
తెలుగు ప్రేక్షకులకు కెరటం సినిమా తో పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత హీరోయిన్ గా మంచి స్టార్ డమ్ ను దక్కించుకుంది. స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకుని నెం.1 స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు కొనసాగింది.
ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ కు పరిమితం అయ్యింది. సౌత్ లో సినిమాలు చేయాలని ఉన్నా సరైన పాత్రలు... సినిమాలు రాకపోవడంతో బాలీవుడ్ కు పరిమితం అయ్యింది. అక్కడ అరడజను సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సౌత్ సినిమాలకు దూరం అయినట్లేనా అంటూ కొందరు ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె చేసిన వ్యాక్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సాదారణంగా మనిషికి అన్ని ఫీలింగ్స్ ఉంటేనే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అనడంలో సందేహం లేదు. అయితే ఆ ఫీలింగ్స్ ఒక స్థాయి వరకు ఉంటేనే మంచిది.. లేదంటే ఆ ఫీలింగ్స్ అధికం అయ్యి.. కాస్త ఓవర్ డోస్ అయితే అది కూడా అనారోగ్య సమస్యే అంటారు. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఒకరి పై ఒకరు ఈర్ష్య తో రగిలి పోవడం అనేది సమయం వృథా చేసుకోవడం తప్ప మరేమి లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇండస్ట్రీలో ఒక హీరో పై మరో హీరోకి... ఒక హీరోయిన్ పై మరో హీరోయిన్ కి ఇలా ప్రతి ఒక్కరిలో ఎక్కువగా ఈర్ష్య కనిపిస్తూ ఉంటుంది. కాని తాను మాత్రం ఈర్ష్య పడ్డ సందర్బాలు లేవు అంటూ చెప్పుకొచ్చింది. గతంలో ఎప్పుడు కూడా తాను ఒకరిని చూసి ఈర్ష్య పడటం కాని.. తనను తాను తక్కువ చేసుకుని చూసి బాధ పడటం కాని చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది.
మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి ఈర్ష్య పడటం వల్ల అవతలి వారికి జరిగే నష్టం ఏమీ లేదు. మన సమయం వృద్దా అవ్వడం.. మన యొక్క పని ఆగిపోవడం జరుగుతుంది. తద్వార వారి కంటే మరింతగా మనం వెనుకపడి పోతాం. అందుకే ఈర్ష్య అనేది పక్కన పెట్టి మనకు మనం ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్లాలి అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.
ఎప్పుడు అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకునే రకుల్ ఇలా ఈర్ష్య ద్వేషం అంటూ చెప్పడం కొత్తగా ఉందని.. ఆమె లో కొత్త యాంగిల్ చూసినట్లుగా అనిపిస్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.