టాలీవుడ్ లో రకుల్ అత్యంత అభిమానించే హీరో..!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం ముంబయి వెళ్లి బాలీవుడ్ సినిమాలతో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చాలా రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసే ఫోటోలు మరియు వీడియో లు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె అందాల ఆరబోతను కోట్ల మంది అభిమానిస్తూ ఉంటారు.
ఆమె సోషల్ మీడియాలో ఎంతగా అయితే అందాలను ఆరబోస్తూ ఉంటుందో అదే తరహా లో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చేరువగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది. చాలా మంది అభిమానులు రెగ్యులర్ గా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం తో పాటు.. రెగ్యులర్ గా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఫ్యాన్స్ కు మరింతగా దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటిలాగే అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఆ చిట్ చాట్ లో రకుల్ ప్రీత్ సింగ్ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. దాని ప్రకారం ఈ అమ్మడు ఆర్ ఆర్ ఆర్ సినిమాను చాలా ఎంజాయ్ చేసిందట. ఆ సినిమా గురించి మాట్లాడేందుకు మాటలు లేవంది. కాని సినిమాలోని ప్రతి ఒక్కరు కూడా అద్బుతంగా నటించారని మాత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమా పై తనదైన శైలిలో కామెంట్స్ చేసింది.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు అత్యంత అభిమాన హీరో ఎవరు అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా అందుకు ఆమె సమాధానంగా అల్లు అర్జున్ పేరును చెప్పింది. వీరిద్దరి కాంబోలో బోయపాటి దర్శకత్వంలో సరైనోడు సినిమా వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా లో ఇద్దరి మద్య కెమిస్ట్రీ.. రొమాన్స్ ఎక్కువగా లేదు. అయినా కూడా అల్లు అర్జున్ కు ఈమె బాగా కనెక్ట్ అయినట్లుగా ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ తన అభిమాన హీరో అంటూ చెప్పడంతో చర్చ మొదలయ్యింది. ఎప్పటి లాగే అల్లు అర్జున్ అభిమానులు సందడి మొదలు చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్ అభిమానంను దక్కించుకున్న అల్లు అర్జున్ ది గ్రేట్ అంటూ సోసల్ మీడియా లో బన్నీ ఫ్యాన్స్ చేస్తున్న హడావుడి కొద్దిపాటిది కాదు. ప్రతి ఒక్క బన్నీ ఫ్యాన్స్ ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తంచ ఏస్తూ ఉంటారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ యొక్క సినిమాల విషయానికి వస్తే సౌత్ లో ఈమె సందడి లేదు కాని బాలీవుడ్ లో మాత్రం జోరు కు ఇతర హీరోయిన్స్ బేజారు అవ్వాల్సిందే.