'ఆమె నా చెంప చెళ్లుమనిపించింది' స్టార్ నటుడి వివరణ
సౌత్ సినీ ఇండస్ట్రీ లో తనదైన నటనతో టైమింగ్ తో అన్నీ విధాలా సక్సెస్ అందుకున్నారు నటుడు సుధాకర్. ఈయన తెలుగునాట పుట్టినా ఆరంభంలో తమిళ ఇండస్ట్రీలో హీరోగా విజయకేతనం ఎగురవేశాడు. ఆ తరువాత మాతృభాష తెలుగులో హీరోగా నిలదొక్కుకోవాలని చాలా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం ఫలించక పోవడంతో రూటు మార్చి క్యారెక్టర్ యాక్టర్ గా, విలన్ గా, కమెడియన్ గా విభిన్న పాత్రలతో అలరించాడు. చేసిన ప్రతీ క్యారెక్టర్లో మంచి మార్కులు సంపాదించి ఆదరణ పొందాడు. సుధాకర్ ఎన్ని విభిన్న పాత్రలు పోషించినా, ఆయనకు హాస్యనటుడిగానే మంచి గుర్తింపు లభించింది. సుధాకర్ కామెడీ తో అనేక చిత్రాలు కలెక్షన్ల వర్షంలో తడిశాయి. నటునిగానే కాకుండా నిర్మాతగానూ సుధాకర్ కొన్ని చిత్రాలను నిర్మించాడు. అందులో ఆయనకు సంతృప్తిని కలిగించిన చిత్రం మిత్రులతో కలసి చిరంజీవి హీరోగా నిర్మించిన 'యముడికి మొగుడు'. ఇక ఆయన నటనతో ఎన్నో అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు.
ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి రాధిక తనను చెంప దెబ్బ కొట్టిన సంఘటన పై క్లారిటీ ఇచ్చారు. సుధాకర్ మొదట తమిళ సినిమాలో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. గ్రేట్ భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన 'కిజక్కే పోగం రైల్'(1978) అనే సినిమాలో కథానాయకుడిగా నటించిన సుధాకర్ మొదటి అడుగులోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక అందులో హీరోయిన్గా స్టార్ హీరోయిన్ రాధిక నటించిందట. ఇక ఆ సినిమా టైంలో రాధికతో జరిగిన సంఘటన గురించి ఆయన మాట్లాడుతూ.. 'నా ఫస్ట్ సినిమా ఫస్ట్ డే షూటింగ్ రోజు రాధికతో ఫస్ట్ సీన్ అనగానే టెన్షన్ పడ్డాను. ఆమెను ఎత్తుకొని గాలిలో తిప్పాలి. ఆ టైంలో గాల్లో తిప్పేటప్పుడు అనుకోకుండా నా చేతులు ఆమెను తాకరని చోట తాకాయి. ఇక రాధిక కోపంతో గట్టిగా చెంప చెళ్లుమనిపించింది. వెంటనే ఆమెకు క్షమాపణ కూడా చెప్పాను. ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇద్దరం కలిసి 12సినిమాలు చేసాం.. అప్పట్లో మా జంటకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పటికి రాధిక ఎక్కడ కన్పించినా నవ్వుతూ ఫ్రెండ్లీగా మాట్లాడుతుందని ముగించారు.