సినిమా హిట్టైనా-ఫ్లాపైనా నేను మారను: పూజా హెగ్డే
గత ఏడాది వరకు బ్రేకుల్లేని హిట్లతో కెరీర్ పరంగా యమ జోరు చూపించిన టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. ఈ ఏడాది ఆరంభంలో పూజా హెగ్డే నుండి రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి మూడు పెద్ద చిత్రాలు వచ్చాయి. కానీ భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలు సొంతం చేసుకున్నాయో తెలిసిందే.
ఈ మూడు పరాజయాల తర్వాత పూజా హెగ్డేను చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేశారు. గోల్డెన్ లెగ్ అన్న వాళ్లే ఐరన్ లెగ్ అంటూ ఆమె పై విమర్శల వర్షం కురిపించారు. అయితే సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తాను మాత్రం మారనంటోంది ఈ అందాల తార. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
ఈ క్రమంలోనే `హీరోయిన్ గా నా బాధ్యత ప్రేక్షకులకు వినోదాన్ని, సంతోషాన్ని పంచడం. సినిమా హిట్టైనా, ఫ్లాపైనా ఆ విషయంలో నేను మారను. జయాపజయాలకు అతీతంగా ప్రతి సినిమాకు నా బాధ్యత నెరవేర్చాను. ఇకపై కూడా నెరవేరుస్తాను. సినిమాల పట్ల నా దృక్పథం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఆ సినిమా విజయం సాధిస్తుందా..? లేదా..? అనేది వేరే విషయం` అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.
దీంతో ఈ బ్యూటీ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. కాగా సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన సర్కస్ చిత్రంలో నటిస్తోంది. అలాగే కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోడీగా `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` అనే యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ చేస్తోంది. ఇటు తెలుగులో బుట్టబొమ్మ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో భాగం అయింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం.. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లి ఒక షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ దసరా అనంతరం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, పలు అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతోంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే `జనగణమన` చిత్రంలోనూ పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే `లైగర్` బిగ్ డిజాస్టర్ అవ్వడంతో `జనగణమన` ఉందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.