ఫోటో స్టోరి: అల దెబ్బకు అల్లాడిపోతారంతే
వరుస ఫ్లాపుల్లా ఉన్నా మెరుపు తగ్గని బ్యూటీగా పూజా హెగ్డే దూసుకెళుతోంది. దక్షిణాది ఉత్తరాది సినిమాలతో కెరీర్ పరంగా క్షణం తీరిక లేకుండా ముందుకెళుతోంది. ఈ భామకు సామాజిక మాధ్యమాల్లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లతో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఈ సండే పూజా విజువల్ ఫీస్ట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
బ్రౌన్ కలర్ బ్రాసరీ కలర్ ఫుల్ టాప్ తో మోటైన హాట్ లుక్ లో కనిపించింది పూజా. అంతగా సవరించని శిరోజాలతో చిరునవ్వులు చిందిస్తూ కాస్త మాసీ అప్పియరెన్స్ తో పూజా కనిపిస్తోంది. ఈ లుక్ లో పూజా అందచందాలు ఒక మైమరపు అని చెప్పాలి.
అల వైకుంఠపురములో బిగ్ సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత కొన్ని వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న పూజా మళ్లీ భారీ సినిమాలతో తిరిగి అభిమానుల ముందుకు పూజా రాబోతోంది. `కభీ ఈద్ కభీ దీపావళి`గా పాపులరైన సల్మాన్ `భాయిజాన్`లో పూజ కథానాయిక. రణవీర్ సింగ్ `సర్కస్`లో కూడా కనిపించనుంది. పూజా హెగ్డే ఇటీవల హైదరాబాద్ భాయిజాన్ పాట చిత్రీకరణలో పాల్గొంది. భాయిజాన్ లో సల్మాన్- వెంకటేష్ - రామ్ చరణ్ లతో కలిసి పూజా స్క్రీన్ ని షేర్ చేసుకోవడం ఆసక్తికరం. తెలుగులో మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా లో కథానాయికగా నటిస్తోంది. దేవరకొండ- పూరీతో `జనగనమణ`లోనూ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే.
ఆ నవ్వులోనే ఉంది గమ్మత్తు
పూజా హెగ్డే ముఖంపై అందమైన చిరునవ్వు ఎప్పుడూ కనిపిస్తుంది. సంతోషమే సగం బలం.. దాంతోనే అందం ఇనుమడిస్తుందని పూజా నమ్ముతుంది. అందుకే తన మోముపై చిరునవ్వును అస్సలు చెరిగిపోనివ్వదు. అలాగే సెట్లో నన్ను సంతోషపరిచేలా షూటింగ్ చేయండి అని కూడా తన దర్శకులను కోరుతుంది ఈ బ్యూటీ. నిరంతరం యోగా మెడిటేషన్ తో ఒత్తిడిని ఈ భామ అస్సలు దరి చేరనివ్వదు. ఇక ఫోటోషూట్ల కోసం నవ్వే నవ్వులో ఎంతో గమ్మత్తు మత్తెక్కిస్తుంది సుమీ!