పాపం పూజాను ఆదుకునేది మ‌న గురుడేనా?

Update: 2022-11-20 12:30 GMT
సౌత్- నార్త్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఓ వెలుగు వెలిగింది పూజా హెగ్డే. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్ లో న‌టించిన ఈ బ్యూటీ ఇప్ప‌టికీ యువ‌హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ.. స్టార్ హీరోల‌తో కాల్షీట్ల‌ను మ్యానేజ్ చేసేస్తోంది. తెలుగు-హిందీ-త‌మిళంలో పూజా ప్ర‌యాణం ఇన్నాళ్లు స‌జావుగా సాగినా కానీ వ‌రుస ఫ్లాపుల‌తో ఇటీవ‌ల బిగ్ బ్రేక్ ప‌డింది. ఇటు తెలుగులో అగ్ర హీరోలు హిట్లివ్వ‌లేదు. అలాగే అటు హిందీలోను మెరుగైన ఫ‌లితాలేవీ ద‌క్క‌లేదు. అటు త‌మిళంలోను ఎన్నో హోప్స్ పెట్టుకున్న `బీస్ట్` ఫ్లాపైంది.

మ‌రోవైపు త‌న‌కు కెరీర్ ప‌రంగా స్వింగ్ నిచ్చిన తెలుగు సినిమాలో పూజా  కనిపించి చాలా కాలం అయ్యింది. అల వైకుంఠ‌పుర‌ములో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో నటించినా భారీ పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ ఫ్లాప‌వ్వ‌డంతో త‌న గ్రాఫ్ త‌గ్గింది. పూజా ఇప్పుడు మహేష్ బాబు -త్రివిక్రమ్ ల SSMB28తో తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ ఈపాటికే ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది.

ఇంత‌కుముందు క‌రోనా కార‌ణంగా.. ఇప్పుడు మ‌రో కార‌ణంతో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ ఆల‌స్య‌మైంది. తన తండ్రి కృష్ణ మరణంతో మహేష్ వ్యక్తిగతంగా చాలా నష్టపోయారు. ఒకే ఏడాదిలో ఘ‌ట్ట‌మ‌నేని కుటుబం ముగ్గురిని కోల్పోవ‌డం పెను విషాదం నింపింది. దీంతో మ‌హేష్ కోలుకునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. కొన్నాళ్ల విరామం త‌ర్వాత ఆపై SSMB28 షూటింగ్ ను తిరిగి ప్రారంభించే అవ‌కాశం ఉంది.

ఈ నెల చివ‌రి నాటికి అన్ని వైపుల నుంచి క్లారిటీ రానుంది. డిసెంబర్ లో షూటింగ్ ని మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని తాజాగా గురూజీ కాంపౌండ్ నుంచి హింట్ అందింది. ఇదిలా ఉంటే, మహర్షి తర్వాత మళ్లీ మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు పూజా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. త్వ‌ర‌గా టాలీవుడ్ లో తిరిగి ట్రాక్ లోకి రావాల‌ని ఆత్రంగా ఉందిట‌. టాలీవుడ్ లో కోల్పోయిన ప్ర‌భ‌ను తిరిగి తీసుకు రావాల‌ని క‌ల‌లు కంటోంది. మ‌రోవైపు అటు బాలీవుడ్ లో స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న న‌టిస్తున్న భారీ చిత్రం త‌న‌కు హిట్టిస్తుంద‌ని గంపెడాశ‌తో ఉంది. భాయ్ ఇటీవ‌లి ట్రాక్ రికార్డ్ స‌రిగా లేనందున ఈ సినిమాతో ఎట్టి ప‌రిస్థ‌తిలో కంబ్యాక్ అవ్వాల‌ని స‌ల్మాన్ సైతం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు.
Tags:    

Similar News