పవన్ కోసం ఆమె దీక్షకు దిగింది

Update: 2018-04-18 10:36 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి టాలీవుడ్లో. ఈ వ్యాఖ్యల పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. శ్రీరెడ్డి వెంట ఉన్న మహిళా సంఘాల నేతలు సైతం ఆ వ్యాఖ్యల విషయంలో విచారం వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీరెడ్డి కంటే ముందు నుంచే కాస్టింగ్ కౌచ్ విషయంలో ఆరోపణలు చేస్తూ.. ఆ తర్వాత శ్రీరెడ్డికి బాసటగా నిలిచిన హీరోయిన్ మాధవీలత సైతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి భాష వాడటం దారుణమని.. పవన్ తల్లిని దూషించేలా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని అంది. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా తాను మౌన దీక్ష చేయబోతున్నట్లు కూడా ఆమె నిన్ననే ప్రకటించింది. ఆ ప్రకారమే ఈ రోజు మాధవీలత దీక్షకు దిగింది.

ఉదయం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ వద్దకు చేరుకుని దీక్ష చేపట్టింది మాధవీలత. ఆమెకు కొందరు సంఘీభావం ప్రకటించారు. ఐతే కాసేపటి తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని దీక్ష ఆపించారు. మాధవిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఐతే తాను పోలీస్ స్టేషన్లో కూడా దీక్ష కొనసాగిస్తానని లోపలికి వెళ్లే ముందు మీడియా వాళ్లతో మాధవీ లత అంది. ఆ తర్వాత స్టేషన్ నుంచి బయటికి వచ్చిన ఆమె తన దీక్ష కొనసాగుతుందని ట్విట్టర్లో పేర్కొంది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు సంస్కార హీనమైనవని ఆమె మరోసారి నిరసన వ్యక్తం చేసింది. మరోవైపు పవన్ అన్నయ్య నాగబాబు ఈ రోజు మీడియా సమావేశం పెట్టి శ్రీరెడ్డి తీరును దుయ్యబట్టారు. పవన్ వ్యాఖ్యల్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉండొచ్చని.. కానీ కొందరు తప్పు చేస్తే అందరినీ అనడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News