బ్యాడ్ గాళ్ గుండె ప‌గిలిపోయింది.. కార‌ణ‌మిదే!

Update: 2022-04-05 02:30 GMT
ఇటీవ‌ల ఉక్రెయిన్ వార్ స‌న్నివేశం గుండెలు ప‌గిలేలా చేసింది. దాని గురించి చ‌ర్చ సాగుతుండ‌గానే ఇంత‌లోనే శ్రీ‌లంక ఆర్థిక క్రైసిస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిబేట‌బుల్ గా మారింది. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిన‌దే. ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి కర్ఫ్యూను ప్రకటించింది, అయినప్పటికీ స‌న్నివేశం ఇంకా దారికి రాలేదు.

ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ప్రజలు ఇప్పటికీ రోజువారీ నిత్యావసరాల కోసం కష్టపడుతున్నారు. ఇలాంటి సవాల్ సమయంలో 40000 టన్నుల బియ్యం .. భారీగా డీజిల్ నిల్వ‌ల‌ను పంపడం ద్వారా భారతదేశం ముందుకు వచ్చి శ్రీలంకకు అండ‌గా నిలిచింది. కానీ భయాందోళన పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. ఈ సంక్షోభానికి పరిష్కారం కనుగొనేందుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను మంత్రివర్గంలో చేరాలని శ్రీలంక అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

స్వ‌త‌హాగా శ్రీ‌లంక‌న్ బ్యూటీ అయిన‌ సాహో బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన మాతృభూమిలో పరిస్థితి గురించి త‌ల్ల‌డిల్లిపోతోంది. గుండె పగిలిపోయిందని వ్యాఖ్యానించింది. శ్రీలంకన్ గా నా దేశం నా దేశప్రజలు ఎలాంటి క‌ష్టం అనుభవిస్తున్నారో చూడటం చాలా హృదయ విదారకంగా ఉంది అని జాక్వెలిన్ ఆవేద‌న చెందింది.

అయితే ఆమె పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి జాక్వెలిన్ చాలా అభిప్రాయాలను వ్య‌క్త‌ప‌రిచింది. ఎవ‌రో ఒక‌రిని దూషించడం చాలా త్వరగా జరుగుతుంది. పరిస్థితిని విస్త్ర‌తంగా గ్రహించి వ్యాఖ్యానించడం కంటే ప్రతి ఒక్కరినీ మరింత దగ్గరగా తీసుకురావడానికి ప్ర‌య‌త్నించాలి. దేశ శ్రేయ‌స్సు కోసం రెండు నిమిషాల‌ ప్రార్థన చేయాలని ఆమె ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసింది.

జాక్వెలిన్ మిస్ యూనివర్స్ శ్రీలంకగా కిరీటాన్ని గెలుపొంది ప‌దిహేను సంవ‌త్స‌రాలైంది. 2006లో కిరీటం గెలుచుకుంది. మూడు సంవత్సరాల తరువాత అంటే 2009లో సినీఎంట్రీ ఇచ్చింది. రితేష్ దేశ్ ముఖ్ `అలాదిన్` తో ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సల్మాన్ ఖాన్  కిక్ తో జాక్వెలిన్ స్టార్ డమ్ కి ఎదిగింది.

ఆమె చివరిసారిగా జాన్ అబ్రహం ఎటాక్ లో కనిపించింది. ఇంత‌కుముందు ప్ర‌భాస్ సాహోలో స్పెష‌ల్ నంబ‌ర్ తో అద‌ర‌గొట్టి బ్యాడ్ గాళ్ గా తెలుగునాటా పాపుల‌రైంది. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులో న‌టించాల్సి ఉండ‌గా కొన్ని కార‌ణాల వ‌ల్ల మూవీ నుంచి వైదొలిగింద‌ని క‌థ‌నాలొచ్చాయి.
Tags:    

Similar News