పెళ్లికి సిద్ద‌మైన హ‌నీరోజ్..వ‌రుడు ఎలా ఉండాలంటే?

Update: 2023-03-28 05:00 GMT
హానీరోజ్ పేరిప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో మారుమ్రోగుతోంది. పిచ్చెక్కించే ఫోజుల‌తో కుర్రాళ్ల నిద్ర లేకుండా చేస్తుంది. `వీర‌సింహారెడ్డి` సినిమాతో లైన్ లోకి వ‌చ్చిన బ్యూటీ అందానికి ఫాలోయింగ్ పీక్స్ లో ఉంది. వీర‌సింహారెడ్డి హిట్ అయిన నాటి నుంచి తెలుగులో మ‌రింత పాపుల‌ర్ అవుతుంది. ఒక్క సినిమాతో నే బోలెడంత గుర్తింపు ద‌క్కించుకుంది.  అలాగ‌ని ఇదే అమ్మ‌డి డెబ్యూ అనుకుంటే?  పొర‌బ‌డిన‌ట్లే.

టాలీవుడ్ లో చాలా ఏళ్ల క్రిత‌మే లాంచ్ అయింది.  అప్పుడు వ‌య‌సు కూడా త‌క్కువే. ఇప్పుడంత అందం ఇప్పుడు లేనులేదు. `ఆల‌యం` అనే సినిమాతో తెలుగులో  తొలుత ప‌రిచ‌య‌మైంది. ఈ విష‌యం ఎంత మందికి తెలుసు. దాదాపు ఎవ‌రికి తెలియ‌ద‌నే చెప్పాలి. అటుపై  అటుపై `ఈ వ‌ర్షంసాక్షిగా` అనే సినిమా లోనూ న‌టించింది.  ఆ త‌ర్వాత ఏడెనిమిదేళ్ల త‌ర్వాత `వీర‌సింహారెడ్డి`లో అవ‌కాశం వ‌చ్చింది.

సాలిడ్ స‌క్సెస్ అందుకుంది. ఇక‌పై హనీకి టాలీవుడ్ లో మ‌రింత మంచి భ‌విష‌త్య్ ఉంటుంద‌ని అభిమా నులు ఆశిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు  ఓగుడ్ న్యూస్ కూడా చెప్పేసింది. పెళ్లికి సిద్దంగా ఉన్నాను అంటూ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. మంచి కుర్రాడు కోసం ఎదురు చూస్తున్నాను అనేసింది.

`జీవితంలో పెళ్లి అనేది ఓ బాధ్య‌త‌. ఆ బాధ్య‌త కి నేను క‌ట్టు బ‌డి ఉంటాను. వివాహ బంధం బ‌లంగా ఉండ‌టం కోసం ఏమి చేయ‌డానికైనా సిద్దంగా ఉన్నాను` అంది. అమ్మ‌డి పేరు ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి ఎఫైర్లోనూ వినిపించ‌లేదు. ఒక‌వేళ దాచేసిన రిలేష‌న్ షిప్ ని ఎక్కువ కాలం కొన‌సాగించ‌నని గ‌తంలో తెలిపింది.

ఈ బ్యూటీ మాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసింది. రెండు ద‌శాబ్ధాల క్రిత‌మే కెరీర్ అక్క‌డ ప్రారంభించింది. అదే స‌మయంలో తెలుగుతో పాటు త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోనూ లాంచ్ అయింది. కానీ ఈ రెండు భాష‌ల్లోనూ ఆశించిన విధంగా కెరీర్ సాగ‌లేదు. దీంతో మాలీవుడ్ కే ప‌రిమిత‌మైంది.   ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ తెలుగు సినిమాల వైపు సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News