'చిత్రం చెత్తగా ఉంది' వాడకండి ప్లీజ్!

Update: 2016-10-27 05:11 GMT
సినిమాలకు సంబందించిన రివ్యూలు పాజిటివ్ గా రాస్తే ఓకే కానీ... నెగిటివ్ గా లేక ఉన్నది ఉన్నట్లుగా రాస్తే మాత్రం తెగ ఫీలయిపోతుంటారు సదరు దర్శక నిర్మాతలు - నటీ నటులు. బాగుంది అని రాసినప్పుడు ఆ రైటర్ ఎనాలసిస్ కరెక్ట్ అని - బాగాలేదు అని రాసినప్పుడు ఆ రైటర్ కి సినిమాల గురించి ఏమి తెలుసనే కామెంట్సూ నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ రివ్యూ రాతలపై తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు ప్రభు స్పందించారు.

తాజాగా పత్రికల వారితో ముచ్చటించిన ప్రభు... చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు మీడియాకు తెలియనివి కాదని, సినిమాను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పేర్కొన్నారు. ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడమే కష్టం అయిపోయిన ఈ రోజుల్లో సినిమాలపై మీడియా విమర్శలు రాసేటప్పుడు నెగిటివ్‌ గా రాయరాదని విన్నవించారు. "విమర్శలు చేయండి - తప్పొప్పులను రాయండి. కానీ... చిత్రం చెత్తగా ఉంది అనే పదాలు మాత్రం వాడకండి" అని అన్నారు ప్రభు. ఈ సమయంలో పత్రికల వారితో తనకున్న అనుబంధంతో మాత్రమే ఈ సూచన చేస్తున్నానని పేర్కొన్నారు.

కాగా, ప్రస్తుతం తాను.. తన అన్నయ్య కొడుకు దుశ్యంత్ రామ్‌ కుమార్ నిర్మాతగా మారి ఈశన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న "మీన్‌ కొళంబుం మణ్ పానైయం" చిత్రంలో మాత్రమే నటిస్తున్నానని, ఈ సినిమాలో కమలహాసన్ ఒక అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలిపారు. అలాగే తాను ప్రస్తుతం నటించడం తగ్గించుకున్నానని తెలిపారు. ఇక తన కొడుకు విక్రమ్ ప్రభు నటించిన "వీరశివాజీ" నవంబర్ తొలివారంలో విడుదల కానుందని ప్రభు మీడియాకు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News