• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో లక్కీ ఛాన్స్‌...

మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన కార్తికేయ

By - Tupaki Desk
Update: 2019-12-18 06:12 GMT
ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో హీరోగా పరిచయం అయిన కార్తికేయ సినిమా సినిమాకు నటుడి గా మంచి పేరు దక్కించుకుంటున్నాడు. హీరోగానే సినిమాలు చేయాలని మడి కట్టుకుని కూర్చోకుండా కెరీర్‌ లో ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో విలన్‌ పాత్రలు చేసేందుకు కూడా ఈయన ఓకే చెబుతున్నాడు. ఇప్పటికే నాని హీరోగా నటించిన 'నాని గ్యాంగ్‌ లీడర్‌' చిత్రంలో నెగటివ్‌ పాత్రను చేసిన కార్తికేయ మరో వైపు హీరోగా కూడా సినిమాలు చేస్తూ ఉన్నాడు.

ఇటీవలే కార్తికేయ నటించిన 90ఎంఎల్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రంలో కార్తికేయ నటనకు విమర్శలకు నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇదే సమయంలో కార్తికేయకు తమిళ సినిమాలో అది కూడా స్టార్‌ హీరో అజిత్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ వచ్చిందట. అజిత్‌ హీరోగా ఖాకీ ఫేం హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఒక చిత్రం రూపొందబోతుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో అజిత్‌ ను చాలా కొత్తగా దర్శకుడు వినోద్‌ ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా తమిళ మీడియాలో ఈ చిత్రంపై పలు కథనాలు వస్తున్నాయి.

తమిళ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఈ చిత్రంలో పలువురు స్టార్స్‌ విలన్స్‌ గా కనిపించబోతున్నారట. అందులో ఒక విలన్‌ కార్తికేయ అంటూ సమాచారం అందుతోంది. హీరోగా నటించడం కంటే విలన్‌ గా నటించడం వల్ల నటుడిగా నిరూపించుకునే అవకాశం ఉంటుందని.. అందుకే కార్తికేయ మరోసారి తన నటనను నిరూపించుకునేందుకు ఈ చిత్రంలో చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి కార్తికేయ ఈ వార్తలపై ఎలా స్పందిస్తాడో చూడాలి.
Tags:    
  • Actor Karthikeya To Play A Villain Role In Ajith Movie 
  • Actor Karthikeya To Play A Villain Role 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

Copyright @2026

Powered by Blink CMS