స్టార్ నటుడి కుమార్తె ఇలా షాకిచ్చిందేంటి?

Update: 2020-03-30 10:50 GMT
ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు జయరాం అంటే తెలియని వారుండరు. ఎంతో ఫేమస్ నటుడు అయిన ఈయన ఇటీవల ‘అల వైకుంఠపురం’లో అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించారు. తన నటనతో సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లారు.

మలయాళంలో ప్రముఖ నటుడు అయిన జయరాం.. ఎంతో మంచి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన నటుడు. తాజాగా సోషల్ మీడియాలో ఈయనకు షాక్ తగిలింది. జయరాం కుమార్తె మాలవిక పెళ్లి షూట్ ఫొటోలు బయటకు రిలీజ్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

పసుపు రంగు డ్రెస్ ధరించి పెళ్లి కూతురిలో హోయలొలుకుతున్న ఈమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె పెళ్లి పుకార్లు కూడా షికారు చేశారు.

అయితే మాలవిక పెళ్లి గురించి వచ్చిన వార్తలు తప్పని తేలింది. కేరళలో ఒక ప్రముఖ టెక్స్ టైల్ బ్రాండ్ యాడ్ షూట్ కోసం ఈ యాడ్ తీశారని.. అందులో పెళ్లి కూతురిలా నటించానని మాలవిక తెలుపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం మాలవిక ఒక మోడల్ గా నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె స్టార్ నటుడి కుమార్తె కావడంతో అందరి ఫోకస్ నెలకొంది.


Tags:    

Similar News