కరోనాతో నటి మృతి.. బాలీవుడ్ లో విషాదం
కరోనా మహమ్మారి మరో టీవీ నటిని బలి తీసుకున్నది. ఇప్పటికే ఎందరో ప్రముఖులను, సినీ, టీవీ ఆర్టిస్టులను పొట్టనపెట్టుకున్న మహమ్మారి మరో నటిని తీసుకెళ్లిపోయింది. ఈ ఏడాది సినీ, టీవీ రంగానికి అస్సలు కలిసిరావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు కరోనా దెబ్బకు విలవిలలాడాయి. అయితే టీవీ రంగం, సినిమా రంగం మీద దీని ప్రభావం అధికంగా ఉంది. లాక్‌డౌన్‌తో చాలా కాలంపాటు షూటింగ్‌లకు అనుమతి రాకపోవడం, ఇప్పటికీ థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో ఆ రంగం కుదేలయ్యింది. ప్రముఖ గాయకుడు బాలు కరోనాకు బలయ్యాడు. చాలా మందికి కరోనా సోకినప్పటికీ వాళ్లు కోలుకున్నారు. అయితే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య భట్నగర్ కరోనాతో మృతిచెందారు. ఆమె ఎక్కువగా టీవీ సీరియళ్లలో నటించింది.
ఏ రిస్తా క్యా ఖేల్తా హై సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. నవంబర్ చివరి వారంలో ఆమెకు కరోనా సోకింది. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటినుంచి వెంటిలేటర్ పైనే ఉనన దివ్య సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అమెకు కరోనా సోకిన వారం తర్వాత ఆస్పత్రిలో చేర్పించారు. ప్రారంభంలో హోం ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే ఆమెకు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుండటం మరోవైపు శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందులు ఎదురు కావడంతో ఆస్పత్రిలో చేర్పించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
అయితే ఆమెకు కరోనాపాటు న్యుమోనియా కూడా సోకినట్టు సమాచారం. దీంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడుకోలేకపోయారు. దివ్య మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. టీవీ ఇండస్ట్రీ ఓ గొప్పనటిని కోల్పోయిందని కొనియాడారు. సోషల్‌మీడియాలోనూ ఆమెకు అభిమానులు పెద్ద ఎత్తున సంతాపం తెలుపుతున్నారు.