చైతూనూ అలా చూపించి.. శింబుని మాత్రం..
ఒకే కథతో తమిళ, తెలుగు భాషల్లో వేర్వేరు హీరోల్ని పెట్టి నేటివిటీ సమస్య రాకుండా తనదైన శైలిలో వేర్వేరు సినిమాలు తీస్తుంటాడు డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఏమాయ చేసావె, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి సినిమాలు అలాగే తీశాడు. ఇప్పుడు ఆ రెండు సినిమాల తరహాలోనే మరోసారి నాగచైతన్య, శింబు హీరోలుగా ఓ మూవీ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కు ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే టైటిల్ పెట్టిన గౌతమ్.. తమిళంలో ‘అచ్చం ఎన్బదు మదమైయాడా’ అనే పేరు ఫిక్స్ చేశాడు. ఇంతకముందు ఒకేసారి ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్ టీజర్లు విడుదల చేశాడు. ఐతే ఆ రెండూ దేనికవే భిన్నంగా ఉన్నాయి.
ఇప్పుడు రెండో టీజర్ విషయంలోనూ వైవిధ్యం చూపించాడు గౌతమ్. నవంబరులో నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఓ యాక్షన్ టీజర్ వదిలిన సంగతి తెలిసిందే. అందులో గౌతమ్ మీనన్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. టీజర్ అంతా యాక్షనే కనిపిస్తుంది. ఐతే ఇప్పుడు తమిళ వెర్షన్ కు వేరు ఇంకో టీజర్ రిలీజ్ చేశాడు. అందులో రెహమాన్ మార్కు సాంగ్ ఒకటి యాడ్ చేశాడు. ఇందులో యాక్షన్ కంటే రొమాన్స్ ఎక్కువ కనిపిస్తోంది. తెలుగు టీజర్ ఛాయలు కొంచెం కనిపిస్తున్నాయి కానీ.. ఈ టీజర్ని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు గౌతమ్. చైతూ బర్త్ డే కోసమని రెహమాన్ సాయం లేకుండా హడావుడిగా టీజర్ రిలీజ్ చేశారప్పుడు. ఐతే తమిళ టీజర్ కు ఆ ఇబ్బంది లేకపోయింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Full View