• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్జీవీకి ఏం సినిమాలు...

ఆర్జీవీకి ఏం సినిమాలు తీయాలో చెప్పిన ఏబీఎన్ ఆర్కే?

By - Tupaki Desk
Update: 2022-01-16 05:08 GMT
రాంగోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద దర్శకుడు ఫక్తు ఏపీ సీఎం జగన్ అభిమానిగా ఉన్నారు. అయితే ఎందుకో గానీ సినిమా టికెట్ల వివాదంలో ఏపీ ప్రభుత్వం నచ్చక ఈ మధ్య బయటపడ్డాడు. వరుసగా ట్వీట్లు చేస్తూ ఏపీ సర్కార్ ను ప్రశ్నించాడు. గతంలో జగన్ కు మద్దతుగా.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమా తీసి టీడీపీ అధినేతను ఇరుకునపెట్టారు. చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతీశారు. ఇప్పుడు జగన్ అధికారంలో ఉండడంతో వర్మ సినిమా టికెట్ల వివాదంపై ప్రశ్నించడం ప్రత్యర్థులకు వరమైంది. దాన్ని ఇప్పుడు అందరూ హైలెట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తాజాగా ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆర్జీవీకి అసలు ఇప్పుడు ఏం సినిమాలు తీయాలో సూచించాడు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును తీసుకెళ్లి కాళ్లు వాచిపోయేలా కొట్టిన ఉదంతంపై ఎందుకు సినిమా తీయకూడదు అని వర్మకు ఏబీఎన్ ఆర్కే సూచించాడు.  దానికి వర్మ ‘అది చిన్న లైన్ అని.. రెండు గంటల సినిమా సరిపోదని’ బదులిచ్చాడు.  దీనికి ఆర్కే అంతే సరదాగా స్పందించాడు. ఆర్జీవీకి కథ ఓ లెక్కనా? ‘ఓ నైట్ ఓడ్కా వేసి ఆలోచిస్తే కథ అదే వచ్చేస్తుందని’ ఆర్కే పురిగొల్పారు. అంత లేదంటూ వర్మ తప్పించుకున్నాడు.

ఇక మీకో హర్రర్ ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ చెబుతానని చేస్తావా? అని ఆర్కే తాజాగా వర్మను అడిగాడు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య మీద సినిమా తీయవచ్చు కదా అని ప్రశ్నించాడు. జగన్ అంటే భయం అందుకే ఆ సినిమా తీయరు అంటూ ఆర్జీవీని కాస్త గట్టిగానే రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఆర్కే.

ఇలా వర్మకు కావాల్సిన జగన్ వ్యతిరేక సినిమాల హింట్ ఇచ్చి మరీ ఉసిగొల్పాడు ఏబీఎన్ ఆర్కే. కానీ వర్మ ఫక్తు జగన్ కు అభిమానిగా ఉండడంతో ఆ సినిమాలు తీసే సాహసం చేయకపోవచ్చు. ఒకవేళ వర్మ ఇగో హర్ట్ అయ్యి ఓ ఫైన్ మార్నింగ్ తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రత్యర్థుల మాటలకు స్ఫూర్తి అయ్యి తీసినా తీస్తాడేమో..  ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.







Full View




Tags:    
  • rgv open heart with rk 
  • open heart with rk 
  • viveka murder case 
  • RGV Movies 
  • Ram Gopal Varma 
  • RGVOpenHeartWithRK 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS