లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అభిషేక్ బచ్చన్

Update: 2021-08-13 05:30 GMT
ఆసక్తికర కథనాన్ని ఇంగ్లిషు మీడియాకు చెందిన ఒక ప్రముఖ బిజినెస్ న్యూస్ మీడియా హౌస్ పబ్లిష్ చేసింది. ఒక వెబ్ సైట్ లో వెల్లడించిన డాక్యుమెంట్ల ప్రకారం చూసినప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు కమ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన లగ్జరీ ప్లాట్ ను అమ్మేసినట్లుగా పేర్కొన్నారు. ముంబయిలోని ఒబెరాయ్ 360 వెస్ట్ లో ఉన్న ఈ లగ్జరీ ప్లాట్ ను 2014లో కొనుగోలు చేసినట్లు చెబుతారు.

ముంబయిలోని వర్లి ప్రాంతంలోని ఈ లగ్జరీ ప్లాట్ విస్తీర్ణం 7527 అడుగులు ఉన్నట్లు చెబుతారు. అప్పట్లో రూ.41 కోట్లను కొనుగోలు చేసిన ఈ ప్లాట్ ను తాజాగా రూ.45.75 కోట్లకు అమ్మినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సేల్ డీడ్ పేపర్ల సమాచారం సదరు వెబ్ సైట్ వద్ద ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ 37 అంతస్తుల ప్రాజెక్టులో షాహిద్ కు.. అక్షయ్ కుమార్ తదితరులకు కూడా ప్లాట్లు ఉన్నాయి.

షాహిద్ తన ప్లాట్ కోసం రూ.56 కోట్లు చెల్లిస్తే.. అక్షయ్ రూ.52.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు చెబుతారు. మరి.. వారంతాఅంతేసి పెట్టి కొనుగోలు చేస్తే.. అభిషేక్ బచ్చన్ మాత్రం రూ.45 కోట్ల తక్కువ ధరకే అమ్మేయటం ఆసక్తికరంగా మారినట్లు చెప్పాలి. అయితే.. నిర్మాణ దశలో ఉన్న వేళలో కొనుగోలు చేసిన ప్లాట్ ను తాజాగా అమ్మేసిన ఉదంతంలో.. తక్కువ ధరకే అమ్మేయటమే చర్చగా చెబుతున్నారు.

ఈ లగ్జరీ ప్లాట్ ప్రత్యకతను చూస్తే.. ఈ అపార్ట్ మెంట్ లోని ప్రతి ఒక్కరికి తమ బాల్కనీ నుంచి సముద్రన్ని స్పష్టం చూసే వీలు ఉంటుంది. అద్భుతమైన డిజైన్ ఈ ప్రాజెక్టు సొంతమని చెబుతారు. ఈ లగ్జరీ అపార్ట్ మెంట్ మొత్తం 360 మీటర్ల ఎత్తుతో నిర్మించినట్లు చెబుతారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. అభిషేక్ తండ్రి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ ఏడాది మార్చిలో రూ.31 కోట్లతో 5184 చదరపు అడుగుల ప్లాట్ ఒకటి కొనుగోలు చేసినట్లు చెబుతారు.

క్రిస్టల్ గ్రూప్ నకు చెందిన ఈ భవనాన్ని ఆయన డిసెంబరు 2020లో కొనుగోలు అగ్రిమెంట్ చేసుకున్నప్పటికి 2021 ఏప్రిల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. ఇందుకోసం స్టాంప్ డ్యూటీ కింద రూ.62 లక్షల మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించినట్లుగా చెబుతారు. తండ్రి ఏమో ప్లాట్ కొంటుంటే.. కొడుకు ఉన్న ప్లాట్ ను అమ్మేయటమా? అన్నది మరో ప్రశ్నగా మారింది.




Tags:    

Similar News