హీరో తప్పుతో తృటిలో ఆ ఇద్దరు ప్రాణాలు పోయేవి
హృతిక్ రోషన్ హిట్ మూవీ జిందగీ నా మిలేగీ దుబారా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను అభయ్ డియోల్ వెళ్లడించాడు. షూటింగ్ సమయంలో అభయ్ డియోల్ మరియు ఫర్హాన్ అక్తర్ లు తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు. హృతిక్ రోషన్ తప్పు వల్ల ఆ రోజు ప్రమాదం జరుగబోతుంది.. ఆయనే సమయస్ఫూర్తితో స్పందించడంతో వారిద్దరు కాపాడబడ్డారు. ఈ సీరియస్ ఫన్నీ సంఘటన గురించి అజయ్ డియోల్ సోషల్ మీడియా ద్వారా వెళ్లడించాడు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అసలు విషయం ఏంటీ అంటే హృతిక్ రోషన్ షూటింగ్ లో భాగంగా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆయన వెనుక సీటులో అభయ్ మరియు ఫర్హాన్ లు కూర్చుని ఉన్నారు. కారు స్పీడ్ గా తీసుకు వచ్చి రోడ్డు పక్కన నిలిపి వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్పీడ్ గా కారు నుండి హృతిక్ దిగాల్సి ఉంటుంది. ఇది సీన్... దీనిని చిత్రీకరిస్తున్న సమయంలో హృతిక్ రోషన్ అంతా అనుకున్నట్లుగానే చేశాడు కాని కారు దిగే ముందు హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చి పోయినట్లుగా ఉన్నాడు. దాంతో డౌన్ ఉండటంతో మెల్లగా ఒక లోతైన లోయలోకి కారు పడబోతుంది.
కారు ముందుకు వెళ్తున్న విషయం గమనించి వెంటనే హృతిక్ రోషన్ కారు బ్రేక్ తొక్కి పట్టాడు. అదే సమయంలో వెనుక సీటులో ఉన్న అభయ్ మరియు ఫర్హాన్ లు క్షణాల్లో కిందకు దిగేశారు. ఇది అంతా కూడా షూటింగ్ చేస్తున్నారు కనుక రికార్డ్ అయ్యింది. అప్పటి ఈ వీడియోను ఇప్పుడు అభయ్ షేర్ చేశాడు. హ్యాండ్ బ్రేక్ వేయక పోవడంతో కారు ముందుకు మూవ్ అయ్యింది. వెంటనే హృతిక్ స్పందించాడు. లేదంటే కారు లోయలో పడిపోయేది ఇద్దరు కూడా మృతి చెందే వారు. ఇది ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తున్నా ఆ సమయంలో వారిద్దరికి గుండె జారి పాయింట్ లోకి వచ్చి ఉంటుంది.