ఎన్టీఆర్ కి 'ఆశ పాశం..' చాలా స్పెషల్‌

Update: 2022-03-24 02:30 GMT
ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇద్దరు హీరోలు ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ లు లెక్కకు మించిన ఇంటర్వ్యూ లు ఇచ్చారు. ఇద్దరు కూడా సినిమా లకు సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలు ఎన్నో మీడియా తో షేర్ చేసుకున్నారు. గతంలో ఎప్పుడు కూడా వెళ్లడించని పలు విషయాలను ఇద్దరు హీరోలు వెళ్లడించారు. తాజాగా ఎన్టీఆర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు.

ఆ ఇంటర్వ్యూలో మీకు అత్యంత ఇష్టమైన పాట ఏది.. మీరు ఎక్కువ సార్లు ప్లే చేసిన పాట ఏది అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో కేరాఫ్‌ కంచెర పాలెం లోని ఆశ పాశం అనే పాట అని చెప్పుకొచ్చాడు. వెంకటేష్ మహా దర్శకత్వంలో 2018 సంవత్సరం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా విభిన్నమైన చిత్రంగా నిలవడంతో పాటు సంగీతం పరంగా మంచి మార్కులు దక్కించుకుంది.

ఆ సినిమా లోని ఆశ పాశం అనే పాట జీవిత సత్యాలను తెలియజేసే విధంగా ఉంటుంది. అందుకే చాలా మందికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్‌ కూడా తనకు ఈ పాట ఇష్టం అంటూ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆయన తన కారుతో పాటు తన ఫోన్‌ లో ఎన్నో సార్లు ఈ పాటను ప్లే చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ పాటను ఎన్ని సార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ  వినాలి అనిపిస్తుందని ఎన్టీఆర్ ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్య లను దర్శకుడు వెంకటేష్ మహా సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసి కృతజ్ఞతలు తెలియజేశాడు. తమ సినిమా పాటను ఎన్టీఆర్‌ అభిమానించడం తమకు గర్వకారణం అంటూ వెంకటేష్ మహా చెప్పుకొచ్చాడు. మీరు ఆ మాట చెప్పడంతో నాకు చాలా సంతృప్తిగా ఉందని వెంకటేష్ మహా ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ను ఆయన షేర్‌ చేశాడు.

Tags:    

Similar News