తొలి ఆడిషన్ లో మిస్టర్ పర్ఫెక్ట్ వారసుడు ఫెయిల్
బాలీవుడ్ లో నటవారసుల వెల్లువ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఓవైపు నెపోటిజంపై తీవ్ర ఆరోపణలు ఉన్నా ఏదీ ఆగదన్న సంగతి తెలిసినదే. కింగ్ ఖాన్ షారూక్ వారసుల రంగ ప్రవేశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అలాగే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఇటీవల సీరియస్ గా ప్రయత్నిస్తున్నాడు. అతడు గత ఏడాది కాలంగా హిందీ చిత్రాలలో నటించడానికి ప్రయత్నిస్తున్నారు. అతను ఇప్పటివరకు అనేక ఆడిషన్లు ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేకపోయాడట.
తాజా సమాచారం ప్రకారం.. జునైద్ మరోసారి హిందీ చిత్రంలో ప్రధాన పాత్రను పొందే అవకాశాన్ని కోల్పోయాడు. క్రిటిక్స్ ప్రశంసలు పొందిన మలయాళ చిత్రం `ఇష్క్` హిందీ రీమేక్ లో ప్రధాన పాత్ర కోసం జునైద్ ఇటీవల ఆడిషన్ లో పాల్గొన్నాడని తెలుస్తోంది. అయితే అతన్ని మేకర్స్ తిరస్కరించారు.
సృజనాత్మక కళలు చిత్రనిర్మాణంలో జునైద్ కు ఆసక్తి ఉందని గతంలో అమీర్ చెప్పాడు. అయితే జునైద్ నటుడిగా మారాలా వద్దా అనేది తాను నిర్ణయించనని అమీర్ చెప్పాడు. ఈ నిర్ణయాన్ని తన కొడుకుకు వదిలేశాడు. జునైద్ గత కొన్నేళ్లుగా స్టేజీ నాటకాల్లో నటిస్తున్నారు. అయితే స్టేజీ డ్రామా వేరు.. సినిమా వేరు. స్టేజీ కళాకారుడికి పెద్ద తెరపై నిరూపించుకోవాలంటే చాలా మారాల్సి ఉంటుంది. అయితే స్టేజీ కళాకారుడికి సినీకళాకారుడిగా మారడం ఇతరులతో పోలిస్తే పెద్ద కష్టమేమీ కాదని ప్రూవైంది.