వీడియో: ఐట‌మ్ రాజాలా మారిన‌ 55ఏళ్ల హీరో

Update: 2021-03-10 10:52 GMT
ఆయ‌న వ‌య‌సు 55. కానీ మ‌న‌సు 25. న‌ట‌న‌లోకి దిగితే చంపేస్తాడు. డ్యాన్సుల మాటంటారా.. అస‌లు ఆయ‌న ఈ ఏజ్ లో వేస్తున్న స్టెప్పుల‌కు.. రొమాన్స్ చేస్తున్న మ‌గువల వ‌య‌సుకు.. అస్స‌లు సింక్ అన్న‌దే కుద‌ర‌డం లేదు. తాజాగా పాతిక ప్రాయం న‌వ‌య‌వ్వ‌నితో అత‌గాడి ఐటమ్ రాజా స్టెప్పులు హాట్ టాపిగ్గా మారాయి. అస‌లే యువ‌ ఐటమ్ భామ దూకుడైన ఊపుల‌కు అత‌డి హుషారు తోడై వేడెక్కిపోయింది డ్యాన్స్ ఫ్లోర్.

ఇంత‌కీ ఎవ‌రి మ‌ధ్య ఈ స‌న్నివేశం? అంటే.. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్- ఎల్లీ అవ్ రామ్ గురించే ఇదంతా. ఈ జోడీ `హర్ ఫన్ మౌలా` సాంగ్ టీజర్ లో డాన్స్ ఫ్లోర్ పై అద‌ర‌గొట్టారు. చాలా కాలంగా తెర‌కు దూరంగానే ఉండిపోయిన‌ అమీర్ ఖాన్ త్వరలో తన అభిమానులకు ట్రీటిచ్చేందుకు ఒక ఐటెమ్ పాట‌తో ముందుకొస్తున్నారు.

ఎల్లీ అవ్రమ్ ‌తో కలిసి హర్ ఫన్ మౌలా పేరుతో పెప్పీ ట్రాక్ కోసం జతకట్టారు. స్నేహితుడు కం దర్శకుడు అమీన్ హాజీ కోరిక‌ను కాద‌న‌లేక‌ `కోయి జానే నా` లో ఈ స్పెష‌ల్ నంబ‌ర్ లో అమీర్ న‌ర్తించారు. ఇదో సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్.. ఖునాల్ కపూర్- అమైరా దస్తూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎల్లీతో క‌లిసి సూపర్ చిలౌట్ స్టెప్పుల‌తో టింగురంగ‌డిలాగా కనిపించాడు అమీర్. తాజాగా రిలీజైన టీజర్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.

55 వ‌య‌సులో సెమీ ఫార్మ‌ల్స్ ధ‌రించి పొట్టి హెయిర్ క‌ట్.. చెవి రింగుల‌తో హుషారుగా స్టెప్పులు వేస్తూ క‌నిపించాడు. మరోవైపు ఎల్లీ ఎప్పటిలాగే మెరుపుల మిరుముట్ల సీక్విన్ దుస్తులలో హాట్ గా కనిపించింది. ఈ పాట‌ను తానిష్ బాగ్చి స్వరపరిచారు.  ఏస్ గేయ రచయిత అమితాబ్ భట్టాచార్య లిరిక్ రాశారు. బోస్కో - సీజర్ కొరియోగ్రఫీ అందించారు.

అమీర్ ఖాన్ చివరిసారిగా 2018 చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లో కనిపించాడు. తదుపరి లాల్ సింగ్ త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. మహమ్మారి కారణంగా సినిమా విడుదల ఆల‌స్య‌మైంది.

Full View
Tags:    

Similar News