• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ ఎపిసోడ్ ని ఎక్క‌డికో...

ఆ ఎపిసోడ్ ని ఎక్క‌డికో లేపేసిన ఆద్య‌

By - Tupaki Desk
Update: 2021-05-07 10:52 GMT
మెగా ఫ్యామిలీ నుంచి ఎవ‌రైనా ఒక కొత్త ముఖం తెర‌కు ప‌రిచ‌య‌మైతే ఆ ఎగ్జ‌యిట్ మెంట్ అభిమానుల్లో వేరే లెవ‌ల్లో ఉంటుంది. అందునా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వార‌సులే బ‌రిలో దిగితే ఎలా ఉంటుందో వూహించ‌వ‌చ్చు. ఇక జీతెలుగులో డ్రామా జూనియ‌ర్స్ లేటెస్ట్ షోకు రేణు దేశాయ్ ఒక జడ్జిగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు విజ‌య‌వంతంగా సాగింది. ఇప్పుడు ఐదో సీజ‌న్ కి ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి - గాయ‌ని సునీత‌- రేణు దేశాయ్ జ‌డ్జిలుగా కొనసాగుతున్నారు.

ఈసారి ఎపిసోడ్ కి ప్ర‌దీప్ మాచిరాజు స్థానంలో యాంక‌ర్ ర‌వి హోస్ట్ గా కొన‌సాగుతున్నారు. ఐదో సీజ‌న్ `డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్` హంగామా ఒక రేంజులోనే ఉండ‌నుందని రేణు వార‌సురాలు ఆద్య ఎంట్రీతో అర్థ‌మైంది. త‌ల్లి కూతుళ్ల ఎపిసోడ్ బ్లాస్ట్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని ఇటీవ‌ల రిలీజ్ చేసిన ప్రోమో తెలిపింది.

డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్.. మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అందువ‌ల్ల ఇది వెరీ స్పెష‌ల్. ఈసారి ఎపిసోడ్ లో ప‌వ‌న్-రేణు జంట కుమార్తె ఆద్య ఎంట్రీ హైలైట్ కానుంది. తాజా ప్రోమోలో ఆద్య ఎంట్రీకి వ‌కీల్ సాబ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వ‌స్తుంటే అభిమానులు ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట‌యిపోయారు.

ఆద్య ఎంట్రీ వేళ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. వేదిక‌పైకి వ‌స్తూనే ``ఎప్పటికీ నువ్వు నా బెస్ట్ గిఫ్ట్.. తను నన్ను అమ్మలా చూసుకుంది`` అంటూ కూతురికి ముద్దు పెట్టారు. ఆ వెంటనే ఆద్య కూడా ``మై మమ్మీ ఈజ్ బెస్ట్ మామ్ ఎవర్`` అంటూ వ్యాఖ్యానిస్తూ త‌న త‌ల్లిని హ‌గ్ చేసుకున్నారు.

ఇప్పుడు ఆద్య మన కోసం ఓ పాట పాడుతుంది అంటూ సింగ‌ర్ సునీత ఆహ్వానించ‌గా.. ఆద్య‌ ఓ హిందీ పాటను ఆలపించింది. తర్వాత సునీతతో కలిసి గొంతు కల‌ప‌డం ఆస‌క్తిని క‌లిగించింది.

ఓ డైలాగ్ చెప్పమని ఎస్వీకే కోర‌గానే..``నాకు నచ్చేవి రెండే రెండు. ఒకటి మంచి నిద్ర.. రెండు మా అమ్మ`` అని ఆద్య ఎమోషనల్ డైలాగ్ చెప్పింది. నా గురించి నేనే ఇంట్రడక్షన్ ఇస్తా. నా పేరు రవి. నేను ఇక్కడ హోస్టును.. అని ర‌వి ప‌రిచ‌యం చేసుకోగానే.. ``మీ అమ్మను రవి అక్క అని పిలుస్తాడు కాబట్టి నువ్వు రవి మామ అని పిలువు`` అని సునీత అంటారు. కానీ ఆద్య విసిరిన పంచ్ ర‌వికి ఓ రేంజులోనే తాకింది. ``మీరు మామయ్య కాదు.. తాతయ్య`` అంటూ అదిరిపోయే పంచ్ వేసింది ఆద్య. మొత్తానికి ప‌వ‌న్ వార‌సురాలి బుల్లితెర ఎంట్రీ ఐక్యాచ‌ర్ గా నిలిచింది. ఆద్య ఈ షోకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలవ‌నుంది.
Tags:    
  • Aadhya 
  • Pawan Kalyan 
  • Power Star 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS