• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైటిల్ సాంగ్ ప్రోమో:...

టైటిల్ సాంగ్ ప్రోమో: ఆడవాళ్ళకు జోహార్లు చెప్తున్న శర్వా..!

By - Tupaki Desk
Update: 2022-02-03 11:23 GMT
శర్వానంద్ - రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ''ఆడవాళ్ళు మీకు జోహార్లు''. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర బృందం.. టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మేరకు తాజాగా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టైటిల్ సాంగ్ ప్రోమోని ఆవిష్కరించారు. 'ఆడాళ్ళూ.. మీకు జోహార్లూ..' అంటూ వచ్చిన ఈ గ్లిమ్స్ అలరిస్తోంది. ఇందులో శర్వానంద్ ఎదురుగా ఉన్న మహిళలకు నమస్తే చెబుతూ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేయడమే కాదు.. స్వయంగా ఆలపించారు. లిరిసిస్ట్ శ్రీమణి ఈ గీతానికి సాహిత్యం అందించారు.

సినిమాలో మహిళా పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో టైటిల్‌ తోనే అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ పాటలో కూడా ఆడవాళ్ళ గురించే చెప్పబోతున్నట్లు ప్రోమో  చూస్తే తెలుస్తుంది. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టైటిల్ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోని రేపు శుక్రవారం (ఫిబ్రవరి 4) సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలో ఖుష్బు - రాధిక శరత్‌ కుమార్ - ఊర్వశి వంటి ఎవర్ గ్రీన్ నటీమణులతో పాటుగా వెన్నెల కిషోర్ - రవిశంకర్ - సత్య - ప్రదీప్ రావత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు.
Full View
Tags:    
  • Aadavallu Meeku Joharlu 
  • Sharwanand 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS