సినిమా టికెట్ల అంశంపై ఏపీ హైకోర్టులో కీలక విచారణ

Update: 2022-02-10 11:16 GMT
సినిమా టికెట్ల అంశంపై ఏపీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. సినిమా టికెట్ల ధరలపై త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుందని.. అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. టికెట్ల అంశంపై ఇప్పటికే కమిటీ 3 సమావేశాలు నిర్వహించిందన్నారు. మరోసారి భేటి తర్వాత టికెట్ల ధరల అంశం కొలిక్కి వస్తుందన్నారు.

టికెట్ల ధరల సమస్య పరిష్కారానికి ఏజీ హైకోర్టును సమయం కోరారు. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తితో హైకోర్టు విచారణ మార్చి 10కి వాయిదా వేసింది.

గతంలోనే ఏపీ ప్రభుత్వం చేసిన  సినిమా టికెట్ ధరల నియంత్రణను సవాల్ చేస్తూ ఇటీవల హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. అఫిడవిట్ దాఖలుకు అడ్వేకే్ట జనరల్ సమయం కోరారు. దీంతో హైకోర్టు ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.

సినిమా టికెట్ల వివాదం పతాక స్థాయికి చేరిన వేళ మెగాస్టార్ చిరంజీవితోపాటు టాలీవుడ్ అగ్రహీరోలు, దర్శకులను ఏపీ సీఎం జగన్ పిలిచి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ఈరోజు చర్చించారు.  నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల అభ్యర్థనలను ముందుకు తీసుకొచ్చారు. దీనిపై వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించి ఈనెలాఖరులోపు జీవో జారీ చేసేందుకు మొగ్గుచూపారు.

తాజాగా హైకోర్టులో ఇదే విషయంపై ప్రభుత్వ ఏజీ వివరించారు. ఈ చర్చల అనంతరం సినిమా టికెట్ల రేట్లపై జీవో విడుదల చేయనున్నారు.


Tags:    

Similar News