చిన్మయితో పని చేస్తా: 96 మ్యూజిక్ డైరెక్టర్

Update: 2019-03-25 17:46 GMT
సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి #మీటూ ఆరోపణల ఎపిసోడ్ తెలిసిందే కదా.  లెజెండరీ తమిళ పాటల రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.. ఆ తర్వాత ఆయన పై నిరంతర పోరాటం సాగిస్తోంది.  ఈ పోరాటం ఫలితంగా డబ్బింగ్ యూనియన్ నుంచి చిన్మయిని యూనియన్ ప్రెసిడెంట్ రాధారవి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సస్పెన్షన్ పై చిన్మయి కోర్టు కెళ్ళింది. కోర్టువారు చిన్మయి వాదననే బలపరుస్తూ.. డబ్బింగ్ యూనియన్ లోకి చిన్మయిని తిరిగి తీసుకోవాల్సిందిగా తీర్పు ఇచ్చారు.  కానీ ఇప్పటి వరకూ చిన్మయిని డబ్బింగ్ యూనియన్ లోకి తీసుకోలేదు.

చిన్మయి చివరిగా డబ్బింగ్ చెప్పిన చిత్రం తమిళ సూపర్ హిట్ '96'.  ఈ సినిమాలో త్రిషకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది.. అందరి చేత ప్రశంసలు దక్కించుకుంది.  ఈ సినిమాకు గోవింద వసంత సంగీత దర్శకుడు.  తాజాగా గోవింద వసంత ట్విట్టర్ ద్వారా చిన్మయికి మద్దతు ప్రకటించాడు. "తన సినిమాల్లో చిన్మయి తనంతట తాను 'నో' చెప్పేవరకూ పాడుతుంది.  ఈ విషయంలో ఎవరూ నా తరఫున నిర్ణయం తీసుకోలేరు" అని ట్వీట్ చేశాడు. దీనికి ఒక ఫాలోయర్ "ఒకవేళ నీకు ఎవరూ సినిమా అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తావు?" అని ప్రశించాడు.  దీనికి సమాధానంగా "నేను అలానే బతుకుతా" అంటూ షాకిచ్చాడు.  #మీటూ ఆరోపణల ఎపిసోడ్ తర్వాత కోలీవుడ్ లో ఇలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్ట్ గా చిన్మయికి మద్దతు ప్రకటించడం మొదటిసారి.  దీనికి స్పందించిన చిన్మయి  "గోవింద వసంత మగాడు" అంటూ ట్వీట్ చేసింది.

ఇదిలా ఉంటే నయనతారపై రాధారవి  అనుచిత వ్యాఖ్యలు చేయడం.. అది పెద్ద వివాదంగా మారడం తెలిసిందే.  ఈ ఎపిసోడ్ లో చాలామంది ప్రముఖులు నయనతారకు మద్దతుగా నిలుస్తూ రాధారవిని తప్పుబడుతున్నారు.




Tags:    

Similar News