'లెజెండరీ' బయోపిక్ లైట్ తీసుకున్నారా..??
సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు కలిసి రాకపోతే స్టార్ హీరోల సినిమాలు కూడా మరుగునపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సినిమాలు అనుకున్న సమయంలో రిలీజ్ అయితే ఆ ఫలితం వేరేలా ఉంటుంది. కానీ కరోనా కారణంగా ఏడాది కాలంగా వాయిదా పడుతూ వచ్చినటువంటి సినిమా గురించి ఎలాంటి వార్త వినిపించడం లేదు. అదికూడా ఓ లెజెండరి పర్సనాలిటీ బయోపిక్ కావడం.. బాలీవుడ్ స్టార్ హీరో నటించిన సినిమా కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి బిగ్ స్టార్ బయోపిక్.. మరో బిగ్ స్టార్ యాక్ట్ చేసిన సినిమాపై ఎలాంటి హడావిడి లేకపోవడంతో ఏమైందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇండియాలో బయోపిక్ ట్రెండ్ అనేది ప్రారంభించింది బాలీవుడ్ ఇండస్ట్రీనే. ఇప్పటికి బయోపిక్స్ ట్రెండ్ బాగానే నడుస్తుంది. కానీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బయోపిక్స్ పై మేకర్స్ పెద్దగా ఉత్సాహం చూపట్లేదేమో అని సందేహాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి సైనా సినిమాకు కూడా మేకర్స్ ప్రోపర్ ప్రమోషన్స్ నిర్వహించలేదు. సైనా నెహ్వాల్ బయోపిక్ ను కేవలం ఓ సాధారణ సినిమాగా చూడాల్సి వచ్చింది. ఇప్పుడు అదే సీన్ 1983లో ఇండియాకి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన సారధి కపిల్ దేవ్.. లైఫ్ బయోపిక్ '83' మూవీ విషయంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉన్నా సినిమాలను ప్రేక్షకులతో ఎంగేజ్ చేయాల్సిన రోజులివి.
లేకపోతే రిలీజ్ టైంలో పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. అలాగే జనాలు కూడా ఏదో మాములు సినిమానే స్పెషల్ ఏం లేదని లైట్ తీసుకునే అవకాశం కూడా ఉంది. సో కపిల్ దేవ్ లాంటి లెజెండ్ బయోపిక్ వస్తున్నప్పుడు అందులోను రన్వీర్ సింగ్ లాంటి స్టార్ యాక్ట్ చేసినప్పుడు దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ కూడా ఉండాలి. ఎల్లప్పుడూ రిలీజ్ అయ్యేవరకు ప్రమోషన్స్ జరుగుతూ జనాల నోళ్లలో సినిమా పేరు నానుతుండాలి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. మరి బేసిగ్గా బాలీవుడ్ తో పాటు సౌత్ భాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేశారు. రిలీజ్ ఎప్పుడో కానీ మేకర్స్ మాత్రం చాలా లైట్ తీసుకున్నారు అనిపిస్తుందని టాక్ నడుస్తుంది.
ఈ సినిమాను కబీర్ ఖాన్ తెరకెక్కిస్తుండగా.. భారీ బడ్జెట్ తో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ పై అక్కినేని నాగార్జున రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి ఇకపై ప్రమోషన్స్ మొదలుపెడతారేమో..!