• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  24కి 9 నిమిషాల కోత‌

24కి 9 నిమిషాల కోత‌

By - Tupaki Desk
Update: 2016-05-07 08:36 GMT
సూర్య 24 సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. విడుద‌లైన అన్ని చోట్లా సినిమాకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అటు క్రిటిక్స్‌ - ఇటు ఆడియెన్స్ సినిమాని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు. ఇదేం అంత గొప్ప సినిమా కాదు అంటూనే  చివ‌రిగా చూడాల్సిన సినిమా  అని క్రిటిక్స్ చెబుతుండ‌టంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కి క‌దులుతున్నారు. మ‌రి ఈ టాక్ ఎన్ని వ‌సూళ్లు తెచ్చిపెడుతుందో చూడాలి. స్వ‌యంగా సినిమాని నిర్మించిన సూర్య పిచ్చ హ్యాపీగా వున్నాడు.

సినిమాని ఎలాగైనా అంద‌రికీ చేరువ చేయాల‌న్న త‌ప‌న‌తో ఆయ‌న ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్ని మ‌రింత పెంచేశాడు.  సినిమాపై వ‌చ్చిన విమ‌ర్శ‌లు ఎలాంటివో గ‌మ‌నించి ఆ త‌ప్పిదాల్ని స‌రిదిద్దుకొనే ఛాన్స్ ఏమైనా వుందా అని ఆలోచిస్తున్నాడు. అందులో భాగంగానే సినిమాకి 9 నిమిషాల కోత పెట్టించాడు. సినిమా సెకండాఫ్  మ‌రీ లెంగ్తీగా అనిపిస్తోంద‌ని, ల‌వ్ ట్రాక్ కాస్త బోర్ కొడుతోంద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. వాటినే ట్రిమ్ చేయించాడ‌ట సూర్య‌. దీంతో సినిమా మ‌రింత రేసీగా మారుతుంద‌ని చిత్ర‌బృందం న‌మ్ముతోంది. ఈ రోజు మ్యాట్నీ నుంచే కొత్త వెర్ష‌న్ సినిమా ప్ర‌ద‌ర్శితం కాబోతోంది.

ఈ వీకెండ్ కీల‌కం కాబ‌ట్టి ఈ రెండు రోజులు సినిమాకి మ‌రింత మౌత్ ప‌బ్లిసిటీ జ‌రిగితే ఇక తిరుగుండ‌ద‌ని సూర్య భావిస్తున్నాడ‌ట‌. అందుకోసం తెలుగు - త‌మిళ భాష‌ల్లో మ‌రోసారి ప‌బ్లిసిటీ కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించేందుకు న‌డుం బిగించిన‌ట్టు స‌మాచారం. 24 సినిమా సూర్య‌కి భారీగా లాభాలు తెచ్చిపెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. తెలుగు - త‌మిళ భాష‌ల్లో వ‌స్తున్న వ‌సూళ్లే కాకుండా రీమేక్ రైట్స్ రూపంలో కూడా భారీ రేటు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని సూర్య గ‌ట్టిగా న‌మ్ముతున్నాడు. మ‌రి బాలీవుడ్ జ‌నాలు ఈ సినిమాపై మ‌క్కువ చూపిస్తారో లేదో!
Tags:    
  • Suriya 24 Movie 
  • 24 Movie 
  • Telugu NEws 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS