టాప్ స్టోరి: 2021 సంక్రాంతి పుంజులు
ప్రతియేటా సంక్రాంతి పండగ వస్తోంది అంటే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. కొత్త అల్లుళ్లు చుట్టాలతో కుటుంబ సమేతంగా సినిమా వీక్షణ తెలుగు లోగిళ్లలో చూసేదే. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉండనుంది. మునుపటిలా థియేటర్ల ముందు అంత సందడి ఉంటుందా? అంటే ఇంకా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కరోనా మహమ్మారీకి వ్యాక్సినేషన్ (టీకా) రెడీ అయ్యిందన్న పాజిటివ్ అంశం హోప్ పెంచుతోంది. మునుపటితో పోలిస్తే జనంలో భయం తగ్గడం.. కేసులు తగ్గడం కలిసొచ్చే అంశం. నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ క్రమంలోనే సినిమాల రిలీజ్ లకు నిర్మాతలు ఆసక్తి కనబరడం చర్చనీయాంశమైంది.
ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన `క్రాక్` సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ మేరకు దర్శకుడు గోపిచంద్ మలినేని రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించడం తెలిసినదే. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ ఫిక్సయ్యింది. ఈ మూవీ సక్సెస్ రవితేజ- గోపిచంద్ సహా రీఎంట్రీ ఇస్తున్న శ్రుతిహాసన్ కి ఎంతో కీలకం.
ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న రెడ్ సంక్రాంతి బరిలో వస్తుందన్న ప్రచారం ఉంది. జనవరి లో రిలీజ్ కి నిర్మాత స్రవంతి రవికిషోర్ ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నా ఇంకా దీనిపై అధికారిక కన్ఫర్మేషర్ రావాల్సి ఉంది. రామ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తుండడంతో అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీజర్ పోస్టర్లు మెప్పించాయి.
అలాగే దగ్గుబాటి రానా నటించిన అరణ్య (హాథీ మేరా సాథీ) సంక్రాంతి బరిలోనే రిలీజ్ కి రానుంది. ఇది పోటీతో సంబంధం లేకుండా జనవరి 14 న థియేటర్లలోకి రానుంది. ఈ మూడింటితో పాటు సంక్రాంతి 2021 విడుదలను లాక్ చేసిన మరో చిత్రం తమిళ స్టార్ దళపతి విజయ్ నటించిన `మాస్టర్`. ఇది జనవరి 13 న తమిళం -తెలుగులో ఒకేసారి తెరపైకి రానుంది. ఇప్పటికి సంక్రాంతి పందెంలో ఉన్న పుంజుల వివరాలివి. ఈ నాలుగు క్రేజు ఉన్నవే గనుక బిజినెస్ వర్గాల్లో బెట్టింగ్ పైనా ఆసక్తికర చర్చ సాగనుంది. నెలాఖరు నాటికి మరిన్ని రిలీజ్ లకు సంబంధించిన సమాచారం రివీలయ్యే అవకాశం ఉంది.