• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అరుదైన రికార్డ్‌.....

అరుదైన రికార్డ్‌.. పుష్పకు అన్ని భాషల్లో 100K

By - Tupaki Desk
Update: 2021-08-20 07:09 GMT
అల్లు అర్జున్‌ మొదటి భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప రికార్డ్‌ ల పరంపర కొనసాగుతోంది. సినిమా విడుదలకు ముందే టీజర్.. సాంగ్‌.. పోస్టర్ లతో పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప సినిమా రచ్చ రంబోలా అన్నట్లుగా దూసుకు పోతుంది. తాజాగా పుష్ప నుండి దేవి శ్రీ ప్రసాద్‌ ట్యూన్‌ చేసిన పాట ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ పాట దుమ్ము రేపింది అనడంలో సందేహం లేదు. తెలుగు లో అత్యధిక వ్యూస్‌ ను అతి తక్కువ సమయంలో దక్కించుకోవడంతో పాటు అత్యధిక లైక్స్ ను తక్కువ సమయంలో దక్కించుకున్న పాటగా కూడా పుష్ప ఫస్ట్‌ సింగిల్ నిలిచింది. కేవలం తెలుగు వర్షన్ పాట కే కాకుండా ఇతర భాషల్లో విడుదలైన పుష్ప మొదటి పాటకు కూడా మంచి రెస్పాన్స్ దక్కింది.

విడుదల అయిన అన్ని భాషల్లో కూడా లక్షకు పైగా లైక్స్ ను దక్కించుకున్న ఏకైక పాట పుష్ప పాట అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క భాషలో ఇలాంటి రికార్డులు ఎన్నైనా వస్తూ ఉంటాయి. కాని అన్ని భాషల్లో లక్ష లైక్స్ అనేది అత్యంత అరుదైన విషయం అని... తెలుగు తో పాటు హిందీ.. కన్నడం.. తమిళం మరియు మలయాళం భాషల్లో విడుదల అయిన పుష్ప పాట కు అన్ని భాషల్లో కూడా అనూహ్య స్పందన వచ్చిందనేందుకు సాక్ష్యమే ఈ లైక్స్ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

రంగస్థలం చిత్ర దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప రెండు పార్ట్‌ లుగా రూపొందుతోంది. మొదటి పార్ట్‌ కు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. వచ్చే క్రిస్మస్ కు సినిమా ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. రికార్డ్‌ బ్రేకింగ్‌ వ్యూస్ ను దక్కించుకుంటున్న పుష్ప సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డ్‌ లు బ్రేక్ చేయడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు. ఇండస్ట్రీ హిట్ లు దక్కించుకున్న అల్లు అర్జున్‌ మరియు సుకుమార్ లు కలిసి చేస్తున్న సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా మరో ఇండస్ట్రీ హిట్‌ పక్కా అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పుష్ప కు అత్యంత ఆధరణ దక్కుతుందనే నమ్మకం అంతటా వ్యక్తం అవుతోంది.

ఈ సినిమా తో అల్లు అర్జున్‌ పాన్ ఇండియా స్టార్‌ గా నిలవడం ఖాయం. బన్నీ గత చిత్రాలు కొన్ని పాన్ ఇండియాలో ముఖ్యంగా యూట్యూబ్‌ హిందీ వర్షన్ లో మంచి ఆధరణ దక్కించుకున్నాయి. పుష్ప లుక్‌ తో పాటు టేకింగ్‌ మరియు ఇతర విషయాలు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా లో అల్లు అర్జున్‌ కు జోడీగా రష్మిక మందన్నా నటించిన విషయం తెల్సిందే. ఇక కీలక పాత్రలో అనసూయ నటించింది. సినిమా లో విలన్‌ పాత్రను మలయాళ స్టార్ నటుడు పాహద్ ఫాజిల్ పోషిస్తున్నాడు. మరో కీలక విలన్ పాత్రను సునీల్ తో చేయించారనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ రేంజ్ ఐటెం సాంగ్‌ ను కూడా ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ కోసం ఉంచుతున్నారట. కనుక ఈ సినిమా రచ్చ రంబోలా అన్నట్లుగా మాస్ ఆడియన్స్‌ ను అలాగే అన్ని విధాల ఎమోషన్స్ తో క్లాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.


Tags:    
  • Allu Arjun 
  • TollywoodActor 
  • Bollywood actor 
  • Pushpa 
  • Sukumar 

Similar News

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

2026-11-03 17:30 GMT

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

Copyright @2026

Powered by Blink CMS