సనాతన ధర్మంపై చర్చ.. అర్జున్ స్ట్రాంగ్ కౌంటర్..

కన్నడ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా లేటెస్ట్ కామెంట్స్ మరోసారి సనాతన ధర్మంపై సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

Update: 2026-05-29 06:01 GMT

కన్నడ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా లేటెస్ట్ కామెంట్స్ మరోసారి సనాతన ధర్మంపై సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తమిళనాడు పాలిటిక్స్ లో సనాతన ధర్మంపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు అర్జున్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు చర్చ నడుస్తోంది.

ఇటీవల తన లేటెస్ట్ మూవీ బ్లాస్ట్ జోన్ ప్రమోషన్స్ లో మాట్లాడిన అర్జున్ సర్జా.. సనాతన ధర్మం అనేది మతం కాదని, అది ఒక లైఫ్ స్టైల్ అంటూ చెప్పుకొచ్చారు. మన పేరెంట్స్ ను దేవుళ్లలా గౌరవించడం, ఫ్యామిలీ వాల్యూస్ ను కాపాడుకోవడం, సమాజంలో ధర్మంతో జీవించడం వంటి విషయాలను సనాతన ధర్మం నేర్పుతుందని తెలిపారు. మన పేరెంట్స్ ను పక్కన పెట్టగలరా? లేదు కదా అంటూ మాట్లాడారు.

అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా ఎప్పటికీ రిజెక్ట్ చేయలేమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దీంతో అర్జున్ కామెంట్స్.. మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ గా అంతా భావిస్తున్నారు. ఎందుకంటే 2023 సెప్టెంబరులో అప్పుడు మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్.. రాజకీయ వర్గాల్లో పెద్ద ఇష్యూగా మారిన విషయం తెలిసిందే.

సనాతన ధర్మం ప్రజలను విభజిస్తోందని, దానిని నిర్మూలించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా, ఆయనపై కోర్టు కేసులు కూడా నమోదయ్యాయి. రీసెంట్ గా తమిళనాడు శాసనసభలో మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇప్పుడు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అనేక మంది నెటిజన్లు అర్జున్ కు మద్దతు తెలుపుతున్నారు.

ఇక అర్జున్ సర్జా సినీ జర్నీ విషయానికి వస్తే.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. కన్నడ ఇండస్ట్రీలోని కెరీర్ ను స్టార్ట్ చేసిన అర్జున్.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా అనేక హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులో మా పల్లెలో గోపాలుడు సినిమాతో పరిచయమైన ఆయన.. ఒకే ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.

యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. మైసూర్ సమీపంలోని మధుగిరికి చెందిన అర్జున్ సర్జా.. ఇప్పటివరకు తన కెరీర్ లో 180కు పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. అనేక విషయాలపై ఎప్పుడూ తన అభిప్రాయాన్ని క్లియర్ గా చెబుతుంటారు. ఇప్పుడు సనాతన ధర్మంపై జరుగుతున్న రాజకీయ చర్చల మధ్య తన కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారారు.

Tags:    

Similar News