'హిట్లర్' అన్నయ్యలాగా చెల్లెళ్ల కోసం తపించే హీరో
అర్జున్ కపూర్ కి ఆరుగురు సోదరీమణులు ఉన్నారు. తనతో పాటు అన్షులా కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, సోనమ్ కపూర్, షానయా కపూర్, రియా కపూర్‌లతో కలిసి ఉన్న ఫోటోల బంచ్ ను ఇన్ స్టాలో షేర్ చేశాడు.;
మెగాస్టార్ చిరంజీవికి నిజ జీవితంలో ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారితో ఆయన అనుబంధం ఎంతో గొప్పది. ప్రతి రక్షా బంధన్ రోజున అక్కజెల్లెళ్లు తనకు రాఖీ కట్టేందుకు జూబ్లీహిల్స్ లో ని తన ఇంటికే వస్తుంటారు. ఈసారి కూడా తన సోదరీమణులతో చిరంజీవి రాఖీ పండగను జరుపుకునే ఉంటారని అభిమానులు భావిస్తున్నారు. ఆయన ఇంకా సోషల్ మీడియాల్లో రక్షాబంధన్ ఫోటోలను షేర్ చేయాల్సి ఉంది. ఇక సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో ముత్యాల సుబ్బయ్య రూపొందించిన హిట్లర్ సినిమాని మెగా ఫ్యాన్స్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఈ చిత్రంలో ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు నటించారు. వారందరికీ పెళ్లిళ్లు చేయాల్సిన బాధ్యత అతడిపై ఉంటుంది. ఈ నేపథ్యంలో తెరపై రక్తి కట్టించే సెంటిమెంట్ డ్రామాను పండించారు. బాధ్యతాయుతమైన సోదరుడిగా చిరంజీవి క్లాసిక్ పెర్ఫామెన్స్ .. ఒకే ఫ్రేమ్‌లో ఐదుగురు అందగత్తెలు అయిన చెల్లెళ్లతో కనిపిస్తుంటే సీన్ పండకుండా ఉంటుందా? హిట్లర్ ఆయన కెరీర్ లో హిట్ సినిమాల్లో ఒకటిగా నిలవడానికి సిస్టర్ సెంటిమెంట్ ఒక కారణం.
అయితే ఇప్పుడు బాలీవుడ్ యువహీరో అర్జున్ కపూర్ తన సోదరీమణులతో కలిసి ఉన్న ఓ ఫోటో చూడగానే హిట్లర్ సినిమా రివైండ్ అయింది. అర్జున్ కూడా ఆరుగురు అక్కజెల్లెళ్లకు అన్నయ్య. ఈరోజు రాఖీ పండగ సందర్భంగా వారందరికీ అతడు శుభాకాంక్షలు చెప్పాడు. అతడు తన బాల్యం నుంచి ఎదిగే క్రమంలో తన సోదరీమణులతో కలిసి ఉన్నప్పటి అందమైన స్మృతులను అతడు మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఈ కొల్లేజ్ చూశాక ప్రజలకు ఒకటే సందేహాలు. అసలు కపూర్ బెటాలియన్ లో అంతమంది ఆడపిల్లలు ఉన్నారా? కపూర్ సిస్టర్స్ వాస్తవ కథేమిటి? అనేది పరిశీలిస్తే తెలిసిన సంగతులివి....
అర్జున్ కపూర్ కి ఆరుగురు సోదరీమణులు ఉన్నారు. తనతో పాటు అన్షులా కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, సోనమ్ కపూర్, షానయా కపూర్, రియా కపూర్‌లతో కలిసి ఉన్న ఫోటోల బంచ్ ను ఇన్ స్టాలో షేర్ చేశాడు. ``ఆరుగురు సోదరీమణులతో ఆరు రెట్లు డ్రామా.. గందరగోళం, తగాదాలు, పరిహాసం, కానీ అపరిమితమైన ప్రేమ. హ్యాపీ రక్షా బంధన్!`` అంటూ అర్జున్ సోదర ప్రేమను కురిపించాడు. అన్షులా తన రక్తసంబంధీకురాలైన సోదరి. జాన్వీ కపూర్- ఖుషీ కపూర్ అతడి సవతి సోదరీమణులు. బోనీకపూర్ రెండో భార్య అయిన శ్రీదేవి కుమార్తెలు. కజిన్స్‌లో సోనమ్ కపూర్, రియా కపూర్ బాబాయ్ అనీల్ కపూర్ కుమార్తెలు. షానయా కపూర్ మరో బాబాయ్ సంజయ్ కపూర్ కుమార్తె. సోనమ్ కపూర్ తన భర్తతో లండన్ లో సెటిలైనందున ఈరోజు అందుబాటులో లేదు. ఇక మిగతా సోదరీమణులు భారతదేశంలోనే అందుబాటులో ఉన్నారు.
అర్జున్ కపూర్ ఇటీవల తన జీవితంలోని వివిధ దశల్లో తన సోదరీమణులతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసాడు. రాఖీ సందర్భంగా వారిని మరోసారి తలచుకుంటూ అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అర్జున్ బాల్య దశ నుంచి ఎదిగేసిన యువకుడిగా మారే వరకూ తన ప్రయాణాన్ని కూడా ఈ ఫోటోల రూపంలో ఆవిష్కరించాడు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అర్జున్ ఇప్పటికే బాలీవుడ్ లో 13 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసాడు. కానీ ఆశించిన స్థాయి విజయం ఒక్కటి కూడా నమోదవ్వలేదు. అతడు హార్డ్ వర్క్ చేసిన సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. చివరిగా `మేరే హస్బెండ్ కి బివి` ఫిబ్రవరి 2025లో విడుదలైంది. తదుపరి వరుస చిత్రాల్లో నటించనున్నాడు. అతడు నిర్మాత బోనీకపూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్ కుమారుడు అన్న సంగతి తెలిసిందే.
రక్షా బంధన్ సోదరులు, సోదరీమణుల మధ్య ప్రత్యేక బంధాన్ని సెలబ్రేట్ చేసే పండగ. సోదరీమణులతో నేడు సోదరులు అంతా పండగ జరుపుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో గొప్పదని చాలాసార్లు ప్రూవైంది. తన సవతి తల్లి కుమార్తెలు అయినా కానీ జాన్వీకపూర్, ఖుషీ కపూర్ విషయంలోను అర్జున్ కపూర్ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఇక తన సొంత సోదరి అన్షులా అంటే అతడికి ప్రాణం. సోనమ్- రియాలతోను అతడు గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నాడు.